Ram Charan వ‌ల్ల‌ అమ్మాయిలు ప‌డ‌రు అనే అపోహ పోయింది!

Hyderabad: అమెరికాలో ఇండియ‌న్ బాయ్స్‌కి అమ్మాయిలు ప‌డ‌రు అనుకునేవారని, అది నిజం కాద‌ని రామ్ చ‌ర‌ణ్(ram charan) వ‌ల్లే రుజువైంద‌ని అంటున్నారు ప్ర‌ముఖ ఇండో-అమెరిక‌న్ సింగర్ రాజ‌కుమారి(raja kumari). RRR సినిమాతో రామ్ చ‌ర‌ణ్(ram charan) గ్లోబ‌ల్ స్టార్ అయిపోయారు. అమెరిక‌న్ వీధుల్లో సంద‌డి చేసి అక్క‌డి మీడియాతో మాట్లాడి త‌న‌లో హాలీవుడ్ క‌టౌట్ కూడా ఉంద‌ని వాళ్లకి తెలియ‌జేసారు. ఇక త్వ‌ర‌లో చ‌ర‌ణ్(ram charan) హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. అయ‌తే రాజ‌కుమారి కాన్స‌ర్ట్స్, షోలు చేస్తున్న స‌మ‌యంలో అమెరికాలో ఇండియ‌న్ అబ్బాయిల గురించి ఓ అపోహ‌ ఉండేద‌ట‌. వాళ్ల‌కు అస‌లు అమ్మాయిలే ప‌డ‌రు అని. కానీ ఎప్పుడైతే చ‌ర‌ణ్ అమెరికాలో అడుగుపెట్టారో అక్కడి మీడియా వాళ్లు హాట్‌గా ఉన్నాడు అని రాయ‌డం మొద‌లుపెట్టార‌ట‌. ఆ ఆర్టిక‌ల్స్ చూసి హ‌మ్మ‌య్య‌.. ఇప్ప‌టికైనా ఇండియ‌న్ అబ్బాయిల ట్యాలెంట్ ఏంటో అమెరిక‌న్ల‌కు తెలిసింది అని అనుకున్నాన‌ని రాజ‌కుమారి సంతోషం వ్య‌క్తం చేసారు.