Banglore Rave Party: పోలీసుల అదుపులో నటి హేమ?!
Hema: ప్రముఖ నటి హేమ బెంగళూరు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. వారం రోజుల క్రితం బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో హేమ పట్టుబడ్డారు. ఆ తర్వాత డ్రగ్ టెస్ట్ చేయగా.. హేమకు పాజిటివ్ అని తేలింది. దాంతో విచారణకు రావాలని బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేయగా.. తాను జ్వరంతో బాధపడుతున్నానని.. విచారణకు వచ్చేందుకు మరికొంత సమయం కావాలని లేఖ రాసింది. ఇందుకు పోలీసులు ఒప్పుకోలేదు. ఆమెకు మళ్లీ నోటీసులు. జారీ చేయగా.. ఈరోజు బెంగళూరులో విచారణకు హాజరయ్యారు.
అయితే తనను ఎవ్వరూ గుర్తుపట్టకుండా హేమ పై నుంచి కిందదాకా డాక్టర్లు కరోనా సమయంలో వేసుకున్న యూనిఫాంను వేసుకుని మాస్క్ పెట్టుకుని మరీ వెళ్లారు. తనను ఫోటోలు వీడియోలు తీస్తుంటే పరిగెత్తుకుంటూ కారు ఎక్కి వెళ్లిపోయారు. విచారణ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో రేపో ఎల్లుండో హేమను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రెండు వారాల క్రితం హేమ బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లో జరిగిన ఓ రేవ్ పార్టీకి వెళ్లారు. పార్టీలో డ్రగ్స్ సేవిస్తున్నారని తెలిసి పోలీసులు రైడ్లు చేసారు. దాదాపు 100 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారందరికీ డ్రగ్ టెస్ట్ చేయించగా 83 మందికి పాజిటివ్ అని తేలింది. వారిలో హేమ కూడా ఉన్నారు. అయితే రైడ్ల సమయంలో పోలీసులు హేమను అదుపులోకి తీసుకున్నప్పుడు బాత్రూమ్‌కి వెళ్లి వస్తానని చెప్పి హేమ అదే బార్ ఆవరణలో ఉన్న గార్డెన్‌లో నిలబడి తాను తన ఫాం హౌజ్‌లో చిల్ అవుతున్నానని.. తాను ఎలాంటి రేవ్ పార్టీలకు వెళ్లలేదని అన్నారు. ఆమె ఏ డ్రెస్ వేసుకుందో పోలీసులు అదే డ్రెస్‌తో రేవ్ పార్టీలో దిగిన ఫోటోను బయటపెట్టడంతో హేమ నటన బయటపడింది.