గురూజీ విడదీస్తాడు: గణేష్ కామెంట్ ఆయన గురించేనా!
Hyderabad: ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ (bandla ganesh) ట్విటర్‌లో పెట్టిన ఓ కామెంట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఓ నెటిజన్ అన్నా నాకు ప్రొడ్యూసర్ అవ్వాలని ఉంది అని బండ్ల గణేష్‌కి (bandla ganesh) ట్వీట్ పెట్టాడు. దీనికి గణేష్ రిప్లై ఇస్తూ.. గురూజీకి ఖరీదైన కారు కొనివ్వండి. ఆయనే మిమ్మల్ని ప్రొడ్యూసర్ చేస్తాడు అన్నాడు. దాంతో ఆయన దర్శకుడు త్రివిక్రమ్ గురించే ఇలా కామెంట్ పెట్టారా? అన్న చర్చ మొదలైంది. టాలీవుడ్‌లో త్రివిక్రమ్‌ని (trivikram) అందరూ గురూజీ అని పిలుస్తారు. మరో నెటిజన్ కూడా బండ్ల గణేష్‌కు (bandla ganesh) ఓ ట్వీట్ పెట్టాడు. “గురూజీకి కథ చెప్తే స్క్రీన్‌ప్లే రాసి దానికి తగట్టు మళ్ళీ కథను మార్చి అనుకున్న కథను షెడ్‌కి పంపిస్తాడు అని టాక్ ఉంది” అని కామెంట్ పెట్టాడు. దీనికి కూడా బండ్ల గణేష్ రిప్లై ఇచ్చారు. “అదే కాదు భార్యాభర్తల్ని, తండ్రి కొడుకుల్ని, గురుశిష్యుల్ని ఎవర్నైనా వేరు చేస్తాడు అనుకుంటే అది మన గురూజీ స్పెషాలిటీ” అన్నారు.
గతంలో బండ్ల గణేష్ (bandla ganesh) మాట్లాడిన ఓ ఆడియో ఫైల్ బయటికి వచ్చింది. భీమ్లా నాయక్ (bheemla nayak) సినిమా సమయంలో బండ్ల గణేష్‌ను ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు త్రివిక్రమ్ (trivikram) రావద్దన్నాడని, వాడి వల్లే పవన్ కళ్యాణ్‌కి (pawan kalyan) దూరమయ్యానని ఆ ఆడియోలో బండ్ల గణేష్ చెప్పడం వైరల్‌గా మారింది. కొన్ని రోజుల క్రితం కూడా పవన్ కళ్యాణ్ (pawan kalyan) ఫ్యాన్ ఒకరు ఆయనకు దూరం కావొద్దని, వీలున్నప్పుడల్లా పవన్‌ని కలుస్తూ ఉండాలని కోరాడు. పవన్‌ను కలవాలని తనకూ ఉన్నా డాలర్ శేషాద్రితోనే ప్రాబ్లం అని రిప్లై ఇచ్చారు బండ్ల గణేష్. దీనిని బట్టి చూస్తే గురూజీ కారణంగానే పవన్ కళ్యాణ్‌కు (pawan kalyan) బండ్ల గణేష్ దూరంగా ఉంటున్నట్లు క్లియర్‌గా తెలుస్తోంది.