Bandla Ganesh: విడాకులా?.. ఎవరు చెప్పార్రా లఫూట్!
Hyderabad: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (pawan kalyan).. ఆన్నా లెహ్నోవా (anna lezhnova) అనే రష్యన్ యువతిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పవన్‌కి ఇది మూడో పెళ్లి. ఆన్నాతో పవన్ ఓ కొడుకుని కూడా కన్నారు. అయితే ప్రస్తుతం వరుస సినిమాలు, రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ తన మూడో భార్యకు కూడా విడాకులు ఇచ్చేసారని, ప్రస్తుతం ఆమెను వేరే చోట దూరంగా ఉంచి ఆర్థికంగా సాయం చేస్తున్నారని కొన్ని వెబ్‌సైట్లు రాసాయి. దీనిపై పవన్‌కు వీరాభిమాని అయిన ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ (bandla ganesh) స్పందించారు. నీకు ఎవరు చెప్పార్రా లఫూట్ అంటూ ఆ వెబ్‌సైట్‌ని ట్యాగ్ చేసి మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ (pawan kalyan) గురించి ఎవరు తప్పుగా రాసినా కూడా బండ్ల గణేష్ (bandla ganesh) వెంటనే వారికి సరైన సమాధానం చెప్పి నోరు మూయిస్తుంటారు. కొన్ని కారణాల వల్ల పవన్‌కు దూరంగా ఉంటున్న బండ్ల గణేష్ మళ్లీ ఎప్పుడు ఆయనతో కలిసి సినిమా తీస్తానా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.