Bandla Ganesh: పవన్‌తో సినిమాలు..అదే నా జీవిత లక్ష్యం
Hyderabad: తన జీవిత లక్ష్యం పవన్‌తో (pawan kalyan) సినిమాలు తీస్తూనే ఉండటం అని అంటున్నారు ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ (bandla ganesh). ఆయనకు పవన్ అంటే ఎంత అభిమానమో తెలియంది కాదు. ఈశ్వర పరమేశ్వర పవనేశ్వర అంటూ ఎప్పుడూ ఆయన జపమే చేస్తుంటారు. కానీ డైరెక్టర్ త్రివిక్రమ్ వల్ల బండ్ల గణేష్‌కి పవన్‌కి మధ్య దూరం పెరిగిందని ఆయన పలుమార్లు ఇన్‌డైరెక్ట్‌గా చెప్పారు. ఆ కారణంగానే పవన్‌తో సినిమాలు తీయలేకపోతున్నానని కూడా అన్నారు. అయితే ఈరోజు బండ్ల గణేష్ ఓ ట్వీట్ చేసారు. “ఎప్పటికీ ఇప్పటికీ ఎన్నటికీ నా డ్రీమ్ ఒకటే. పవన్ కళ్యాణ్ తో సినిమా తీయటం తీస్తూ ఉండటం అదే నా డ్రీమ్ అదే ఎయిమ్” అని ట్వీట్ చేసారు.
ఇంతకీ ఆయన ఈ ట్వీట్ ఎందుకు చేసారంటే.. నిన్న నటసింహ నందమూరి బాలకృష్ణ 109వ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత నాగ వంశీ ప్రకటించారు. ఈ సందర్భంగా బాలయ్యతో దిగిన ఫొటోను పోస్ట్ చేస్తూ.. టాలీవుడ్‌కి వచ్చినప్పటి నుంచి ఆయనతో సినిమా చేయాలని కలలు కంటుండేవాడినని ఇప్పటికి ఆ కల తీరిందని ట్వీట్ చేసారు. ఆ ట్వీట్‌కి బండ్ల గణేష్ తనకు కూడా పవన్‌తోనే సినిమాలు తీయాలని ఉందని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.