Bandla Ganesh: రేవంత్ రెడ్డి బ‌యోపిక్.. హీరో ఎవ‌రో తెలుసా?

Bandla Ganesh: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (revanth reddy) అంటే నిర్మాత బండ్ల గ‌ణేష్‌కు ఎంతో అభిమానం. ఆయ‌నే సీఎం అవ్వాల‌ని ఆయ‌న లాంటి మంచి మ‌నిషి ప్ర‌జ‌ల మ‌ధ్య ఉంటే తెలంగాణ మ‌రింత బాగుప‌డుతుంద‌ని ఎప్ప‌టి నుంచో చెప్తూ వ‌స్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి ఒప్పుకోవాలే కానీ బ‌యోపిక్ తీయాల‌నుకుంటున్నాన‌ని త‌న మ‌న‌సులో మాట‌ను బ‌య‌ట‌పెట్టారు. తాను ఎప్పుడూ భారీ బ‌డ్జెట్ సినిమాలు తీస్తుంటారు కాబ‌ట్టి రేవంత్ బ‌యోపిక్‌ని కూడా చాలా భారీగా తీయాల‌నుకుంటున్నాన‌ని.. అలాంట‌ప్పుడు రేవంత్ పాత్ర‌లో చిన్నా చిత‌కా హీరోలు కాకుండా స్టార్ హీరోను పెట్టాల‌నుకుంటున్న‌ట్లు తెలిపారు. అయితే రేవంత్ బ‌యోపిక్‌కి ఒప్పుకుంటే అప్పుడు హీరో ఎవ‌రు అనే వివ‌రాలు వెల్ల‌డిస్తాన‌ని తెలిపారు బండ్ల గ‌ణేష్.