Bandla Ganesh: మీకు జీవితంలో బుద్ది రాదు రా నీచుల్లారా..!

Hyderabad: మీకు జీవితంలో బుద్ది రాదుగా నీచుల్లారా అంటూ ఆగ్ర‌హం వ్యక్తం చేసారు బండ్ల గ‌ణేష్‌ (bandla ganesh). తానా (tana) స‌భ‌ల్లో జ‌రుగుతున్న కొట్లాట‌పై గ‌ణేష్ స్పందించారు. అమెరికాలో జ‌రుగుతున్న తానా స‌భ‌ల్లో త‌ర‌ణి ప‌రుచూరి, వేమ‌న స‌తీష్‌ల‌కు చెందిన ఇరు వ‌ర్గాల వారు చొక్కాలు ప‌ట్టుకుని కొట్టుకున్నారు. ఎన్నారై అధ్య‌క్షుడు కోమ‌టి జ‌య‌రాం స‌మ‌క్షంలోనే ఈ కొట్లాట జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. ఈ గొడ‌వ‌పై బండ్ల గ‌ణేష్ స్పందిస్తూ.. మీకు సిగ్గు లేదురా. జీవితంలో మీకు బుద్ది రాదు మీ బ‌తుకులు చెడా. తానా పరువు తీస్తున్నారు కదా దాని నిర్మించడానికి ఎంతోమంది మన జాతి పెద్దలు పట్టా కష్టాన్ని గంగలో కలిపారు నిచుల్లారా అంటూ మండిపడ్డారు.