Niharika Kondela: బాబాయ్ సినిమా చూసి ఆ నిర్ణయం తీసుకున్నా
Niharika Konidela: మెగా కుటుంబానికి చెందిన నిహారిక కొణిదెల తన పెద్దనాన్న, బాబాయ్‌లాగే మంచి నటి అవుతుంది అనుకున్నారంతా. ఆమె చేసింది కొన్ని సినిమాలే. నాగబాబు కూతురు కాబట్టి కాస్త గుర్తింపు వచ్చింది కానీ నటిగా మాత్రం నిలదొక్కుకోలేకపోయింది. దాంతో నిర్మాతగా మారిన నిహారిక ఇప్పుడు కమిటీ కుర్రాళ్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సందర్భంగా నిహారిక తన టాలీవుడ్ ఎంట్రీ గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. బాబాయ్ పవన్ కళ్యాణ్ నటించిన బాలు సినిమా చూసాక తనకు హీరోయిన్ అవ్వాలనిపించిందని అన్నారు. బాలు సినిమాలోని నీలో జరిగే పాట అంటే తనకు చాలా ఇష్టమని.. ఈ పాట చూసాకే హీరోయిన్ అవ్వాలని అనుకున్నానని వెల్లడించారు.