NBK108: టైటిల్​ ఏంటో తెలుసా?

Hyderabad: నందమూరి నటసింహం బాలకృష్ణ(Nandamuri Balakrishna) , డైరెక్టర్​ అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. NBK108 వర్కింగ్​ టైటిల్​తో రూపొందుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ (Kajal Agarwal) బాలయ్యకు జోడీగా నటించనుండగా.. యంగ్ హీరోయిన్ శ్రీలీల (Sree Leela)) కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ భారీ అంచనాలను క్రియేట్​ చేసింది. కాగా ప్రస్తుతం ఈ సినిమా టైటిల్​ అనౌన్స్​మెంట్​ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కాగా, ఈ చిత్రానికి ‘రామారావు గారు, రావు గారు’ తదితర టైటిల్స్ పరిశీలించినట్లు వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు అఫిషియల్‌గా ‘భగవత్ కేసరి – ఐ డోంట్ కేర్’ (Bhagavath Kesari – I Don’t Care) అనే టైటిల్‌ ఫిక్స్ చేసినట్లు సమాచారం. NBK108 చిత్రంలో బాలయ్య క్యారెక్టరైజేషన్, చరిష్మా, లుక్​కి కేసరి అనే టైటిల్​ బాగా సూటవుతుందని భావిస్తున్నారట మేకర్స్​. కాగా, ఈ సినిమాను అనుకున్న డేట్​ కంటే ముందే విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాతోపాటే బాలయ్య మరో నాలుగు సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే.