Venkatesh Balakrishna: అరె.. మీరూ ఇక్క‌డే షూట్ చేస్తున్నారా!

balakrishna visits venkatesh movie set

Venkatesh Balakrishna: అనుకోకుండా నంద‌మూరి బాల‌కృష్ణ‌, విక్ట‌రీ వెంక‌టేష్ తార‌స‌ప‌డ్డారు. వీరిద్ద‌రూ ప్ర‌స్తుతం త‌మ సినిమా షూటింగ్‌ల‌తో బిజీగా ఉన్నారు. వెంక‌టేష్ అనిల్ రావిపూడితో చేస్తున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జ‌రుగుతోంది. మ‌రోపక్క బాల‌య్య బాబీ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్న NBK 109 సినిమా షూటింగ్ కూడా అక్క‌డే జ‌రుగుతోంది. ఈ విష‌యం తెలుసుకున్న బాల‌య్య వెంట‌నే వెంకీ మామ సెట్స్‌కి వెళ్లి అంద‌రినీ అప్యాయంగా ప‌ల‌క‌రించారు.