Balakrishna: బ‌రిలోకి రాజ‌కీయ నాయ‌కుడిగా..!

Balakrishna: నట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ న‌టుడిగానే కాకుండా మంచి రాజ‌కీయ నాయ‌కుడిగానూ తానేంటో నిరూపించుకున్నారు. తెలుగు దేశం పార్టీ త‌ర‌ఫున ఆయ‌న హిందూపూర్‌లో పోటీ చేసి రెండు సార్లు గెలిచారు. అయితే రియ‌ల్ లైఫ్‌లో బాల‌య్య పొలిటిషియ‌న్‌గా మ‌నం చూసేసాం. మ‌రి రీల్ లైఫ్‌లో చూసేయాలిగా..! పైగా బాల‌య్య రీల్ లైఫ్‌లో పొలిటిష‌య‌న్ అంటే డ‌బుల్ ఇంపాక్ట్ ఉంటుంది. డైలాగులు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌క్కర్లేదు.

ప్ర‌స్తుతం బాబీ ద‌ర్శ‌క‌త్వంలో బాల‌య్య ఓ సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. మొన్న రిలీజ్ అయిన టీజ‌ర్‌కు మామూలు రెస్పాన్స్ లేదు. అయితే ఇందులో బాల‌య్య డ‌బుల్ రోల్‌లో న‌టించ‌బోతున్నారు. ఒక పాత్ర‌లో ఎమ్మెల్యేగా మ‌రో పాత్ర‌లో సాధార‌ణ వ్య‌క్తిగా క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.

అయితే బాల‌య్య పొలిటిషియ‌న్ గెట‌ప్ వేసినా కూడా ప్ర‌స్తుత రాజ‌కీయాల‌ను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి డైలాగులు ఉండ‌కూడ‌ద‌ని చిన్న కండీష‌న్ పెట్టిన‌ట్లు తెలుస్తోంది. కానీ డైలాగులు మాత్రం ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉండ‌బోతున్నాయ‌ట‌. ప్రస్తుతం ఎన్నిక‌ల ప్ర‌చారంలో బిజీగా ఉన్న బాల‌య్య ప్ర‌చారం ముగిసాక షూటింగ్‌లో పాల్గొన‌బోతున్నారు. డిసెంబ‌ర్‌లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.