Balagam : టీంకి తెలంగాణ ప్రభుత్వం సన్మానం!

Hyderabad: టాలీవుడ్​ కమెడియన్ వేణు(Venu) దర్శకుడిగా తెరకెక్కించిన మొదటి సినిమా బలగం(Balagam). ప్రియదర్శి(Priyadarshi), కావ్య కళ్యాణ్ రామ్(Kavya Kalyan Ram) జంటగా తెరకెక్కిన ఈ సినిమాని దిల్ రాజు(Dil Raju) కూతురు హన్షిత రెడ్డి(Hanshitha Reddy)నిర్మించారు. మానవ సంబంధాలు, కుటుంబ విలువలు కథాంశంతో తెరకెక్కించిన ఈ సినిమాని చిన్న సినిమాగా రిలీజయి పెద్ద విజయం సాధించింది. తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులతోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రశంసలే కాదు ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు కూడా అందుకుంది బలగం సినిమా.

తెలంగాణ సంసృతి, సాంప్రదాయాలే ఇతివృత్తంగా బలగం సినిమా తెరకెక్కించడంతో తెలంగాణ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఈ సినిమాను అభినందిస్తున్నారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం తరపున బలగం సినిమా యునిట్ ని సన్మానించారు. ఆదివారం నాడు హైదరాబాద్ మసాబ్ ట్యాంక్ లోని తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ(TSFDC) కార్యాలయంలో బలగం చిత్రయూనిట్ ని తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కూర్మాచలం సన్మానించారు. చిత్ర యూనిట్ కు శాలువాలు కప్పి, జ్ఞాపికలను అందచేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సంసృతి, సంప్రదాయాలు, అనుబంధాలు గొప్పగా చూపించిన సినిమా బలగం. సినిమా చూసి ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో జరిగిన సంఘటనలని గుర్తు చేసుకుంటున్నారు. తెలంగాణ సినిమా మరింత పురోగతి సాధించేందుకు ముఖ్యమంత్రి KCR, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సహకారంతో ప్రభుత్వం తరపున ప్రోత్సాహం అందించడానికి కృషి చేస్తాం అన్నారు.