Re Releases: బ్యాక్ టు బ్యాక్..!

Hyderabad: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్  (pawan kalyan) బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రీ రిలీజ్ (re releases) అవుతున్నాయి. ఒక‌టి గ‌బ్బ‌ర్ సింగ్ (gabbar singh), మ‌రొక‌టి గుడుంబా శంక‌ర్ (gudumba shankar). సెప్టెంబ‌ర్ 2న ప‌వ‌న్ బ‌ర్త్‌డే. ఈ సంద‌ర్భంగా గ‌బ్బ‌ర్ సింగ్ రీ రిలీజ్ చేస్తామ‌ని, ప‌వ‌న్ స్టామినా ఏంటో.. ప‌వ‌ర్ ఏంటో ఆ రోజు చూపిస్తాం అంటూ నిర్మాత బండ్ల గ‌ణేష్ (bandla ganesh) ట్వీట్ చేసారు. మ‌రోపక్క నాగ‌బాబు (naga babu) కూడా గుడుంబా శంక‌ర్ రీ రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆగ‌స్ట్ 31, సెప్టెంబ‌ర్ 1న గుడుంబా శంక‌ర్ రీ రిలీజ్ కానుంద‌ని తెలిపారు. ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్‌కి ఇక పండ‌గే..!