Babu Gogineni: త్రివిక్రమ్ రేప్ డైలాగ్ రాసాడు.. పవన్ పాటించాడు
Babu Gogineni: తనని తాను హేతువాదినని చెప్పుకుంటూ ఎందరో సెలబ్రిటీలపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే బాబు గోగినేని.. ఇప్పుడు త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేస్తూ ముందుకొచ్చారు. పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమాకు త్రివిక్రమ్ డైలాగులు రాసారని.. ఎవరైతే ఆయన్ను గురూజీ గురూజీ అంటారో ఆ గురూజీనే జల్సా సినిమాలో రేప్ డైలాగ్ రాసారని అన్నారు. నిద్రపోతున్న ఆడదాన్ని రేప్ చేస్తే ఏం ఆనందం ఉంటుంది. వెంబడించి చేస్తేనే కదా కిక్ అనే అర్థం వచ్చేలా ఆ డైలాగ్ రాసిన త్రివిక్రమ్‌ని సిగ్గులేని వాళ్లంతా గురూజీ అంటున్నారని గోగినేని వ్యాఖ్యానించారు.
పైగా ఈ డైలాగ్‌ను విలన్‌తో కాకుండా బ్రహ్మానందం లాంటి సీనియర్ కమెడియన్‌ను పక్కన పెట్టించి పవన్ చేతే చెప్పించారని అన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఈ పవన్ కళ్యాణే ఆనాడు రేప్ గురించి మాట్లాడారని మండిపడ్డారు.