Ayushmann Khurrana: భార్య చ‌నుబాలు తాగుతున్న బాలీవుడ్ హీరో

Ayushmann Khurrana drinks tahira kashyap breast milk adding protein powder

Ayushmann Khurrana:  బాలీవుడ్ న‌టుడు ఆయుష్మాన్ ఖురానా.. త‌న భార్య త‌హీరా క‌శ్య‌ప్ చ‌నుబాలు తాగుతార‌ట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా త‌హీరానే మీడియా ద్వారా వెల్ల‌డించారు. రెండో బిడ్డ పుట్టాక త‌హీరా ఓ ట్రిప్‌కి వెళ్లాల్సి వ‌చ్చింది. దాంతో త‌న చ‌నుబాల‌ను ఓ బాటిల్‌లో నింపి ఫ్రిజ్‌లో పెట్టి వెళ్లింద‌ట‌. ఆమె తిరిగి వ‌చ్చాక ఆ పాల‌ను బిడ్డ‌కు ప‌ట్ట‌కుండానే తానే ప్రొటీన్ పౌడ‌ర్ క‌లుపుకుని తాగాన‌ని ఆయుష్మాన్ చెప్పాడ‌ట‌. చ‌నుబాల‌ల్లో పోష‌కాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని.. త‌న వ‌ర్క‌వుట్‌కు బాగా ప‌నిచేస్తుంద‌ని ఆయుష్మాన్ తాగిన‌ట్లు త‌హీరా వెల్ల‌డించారు. దీనిపై ఆయుష్మాన్‌ను స్పందించాల్సిందిగా మీడియా వ‌ర్గాలు కోర‌గా.. అస‌హ్యంగా తాను భార్య చ‌నుబాలు తాగుతాన‌ని ప‌బ్లిక్‌లో ఎలా చెప్పాలి అంటూ అస‌హ‌నం వ్య‌క్తం చేసారు.