హీరోయిన్‌తో వీడియో కాల్.. చెంప చెళ్లుమ‌నిపించిన యువ‌కుడి తల్లి

మ‌న ల‌క్ బాగుంటే మ‌న ఫేవ‌రెట్ హీరో హీరోయిన్స్‌తో లైవ్ చాట్ చేసే వీలుంటుంది. ఈ మ‌ధ్య‌కాలంలో కొంద‌రు న‌టీన‌టులు ఫ్యాన్స్‌కి మ‌రింత ద‌గ్గ‌ర అవ్వ‌డానికి ఈ ట్రెండ్ ఫాలో అవుతున్నారు. బాలీవుడ్ న‌టి అవ్నీత్ కౌర్ (avneet kaur) త‌న డైహార్డ్ ఫ్యాన్ కోస‌మ‌ని అత‌నితో ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో కాల్ ద్వారా మాట్లాడాల‌నుకుంది. త‌న‌కు ఎంతో ఇష్ట‌మైన హీరోయిన్ నుంచి వీడియో కాల్ రావ‌డంతో ఆ యువ‌కుడు ఎంతో సంతోష‌ప‌డిపోయాడు. ఫ్యాన్ పేజ్ క్రియేట్ చేసినందుకు థ్యాంక్స్ అని అవ్నీత్ ఆ అబ్బాయితో చెప్తుండ‌గా.. ఒక్క‌సారిగా ఆ అబ్బాయి త‌ల్లి రూంలోకి వ‌చ్చి చూసింది. ఎవ‌రు ఆ అమ్మాయి ఏంటి ఈ ప‌నులు అంటూ పాపం అత‌ని చెంప చెళ్లుమ‌నిపించింది. ఇదంతా అవ్నీత్ చూస్తుండ‌గానే జ‌ర‌గ‌డంతో త‌ను కూడా షాకైంది. దాంతో వెంట‌నే ఆ అబ్బాయి కాల్ క‌ట్ చేసేసాడు. అవ్నీత్ ఎవ‌ర‌న్న‌ది పాపం వాళ్ల అమ్మ‌కు అర్థ‌మ‌య్యేలా చెప్పాడో లేదో..! (avneet kaur)