1 లక్షతో పెళ్లి చేసుకున్న మహేష్ హీరోయిన్!
Mumbai: సెలబ్రిటీల పెళ్లిళ్లంటే అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి(amrita rao). కొన్ని కోట్లు ఖర్చు పెట్టడానికి కూడా వెనుకాడరు. కానీ నటి అమృతా రావ్(amrita rao) మాత్రం కేవలం ఒకే ఒక్క లక్షతో తన పెళ్లి వేడుకను ఘనంగా జరుపుకున్నారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించారు. తొమ్మిదేళ్ల క్రితం అమృత(amrita rao), ఆర్జే అన్మోల్ (rj anol)పుణెలోని ఓ ఇస్కాన్ టెంపుల్‌లో పెళ్లి చేసుకున్నారు. అది కూడా లక్ష రూపాయలతో. పెళ్లికి అమృత కట్టుకున్న చీర ఖరీదు రూ.3000. ఇక పెళ్లి మండపానికి అయిన ఖర్చు రూ.11000. ఎన్నో సక్సెస్‌ఫుల్ సినిమాల్లో నటించిన అమృత.. పెళ్లికి అనవసర ఖర్చు వద్దనుకుని ఈ నిర్ణయం తీసుకున్నారట. పెళ్లిళ్ల కోసం చాలా మధ్య తరగతి కుటుంబాలు అప్పులు చేస్తుంటారని, అది అస్సలు మంచిది కాదని అన్నారు. ఆ డబ్బు దాచుకుంటే పుట్టబోయే పిల్లలకు కానీ, లేదా ఇల్లు కొనుక్కోడానికి కానీ ఉపయోగపడతాయని ఒక్కరోజు ఆడంబరానికి అంత ఖర్చు అనవసరం అని అన్నారు. ఇకపోతే.. తెలుగులో సూపర్‌స్టార్ మహేష్ బాబుకి జోడీగా అతిథి సినిమాలో నటించారు అమృత. ఈ సినిమా డిజాస్టర్‌గా అయ్యింది. ఆ తర్వాత ఆమె తెలుగు సినిమాల్లో నటించలేదు.