Akhil జాతకంపై వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు!

Hyderabad: అక్కినేని వారసుడు, టాలీవుడ్​ హీరో అఖిల్ అక్కినేని(Akhil Akkineni) నటించిన తాజా చిత్రం ఏజెంట్(Agent)​. ఈ సినిమా ఏప్రిల్​ 28న విడుదలైంది. స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి(Surendar Reddy) దర్శకత్వంలో, భారీ బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కినప్పటికీ ఫలితం మారలేదు. అఖిల్ గత చిత్రాల తరహాలోనే ఏజెంట్ కూడా తీవ్రంగా నిరాశపరిచింది. అఖిల్ ఈ చిత్రం కోసం ఎంతో శ్రమించాడు. రిస్క్ చేసి అనేక యాక్షన్ స్టంట్స్ చేశాడు. ఏడాది పాటు సిక్స్ ప్యాక్ బాడీ మైంటైన్ చేశాడు. కానీ అఖిల్ శ్రమకి తగ్గ ఫలితం దక్కలేదు.

ఈ క్రమంలో అఖిల్ జాతకం గురించి వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. వేణు స్వామి మాట్లాడుతూ.. ‘అఖిల్ జాతకంలో అనేక సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా నాగదోషం ఉంది. ఆ దోషం ఉన్నప్పుడు ఇతరుల సలహాలు మిస్ ఫైర్ అవుతాయి. అఖిల్ హిట్ కొట్టాలంటే ఒక్కటే మార్గం ఉంది. అఖిల్ సినిమాల విషయంలో ఎవరి ప్రభావం ఉండకూడదు. అఖిల్ తన సొంత నిర్ణయాలతోనే సినిమాలు చేయాలి. అఖిల్ జాతకంలో చంద్రుడు నీఛంలో ఉన్నాడు. తల్లి చంద్రుడికి.. తండ్రి సూర్యుడికి సంకేతం. చంద్రుడు నీఛంలో ఉన్నప్పుడు అమల(Amala Akkineni) ప్రమేయం అఖిల్ కి ఏమాత్రం కలసిరాదు. ఇవన్నీ జాతకపరమైన అంశాలు మాత్రమే. వ్యక్తిగత అంశాలు ఏమాత్రం కాదు. అఖిల్ జాతకంలో ఇలానే ఉంది’ అన్నారు వేణు స్వామి.  సినీ తారల భవితవ్యంపై పలు వివాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే వేణుస్వామి(Venu swami) వ్యాఖ్యలపై అక్కినేని కుటుంబం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.