Asin: అప్పుడు బ్రేక‌ప్ అన్నారు ఇప్పుడు విడాకులా?

Hyderabad: ప్ర‌ముఖ న‌టి అసిన్ (asin) విడాకులు తీసుకోనున్నారంటూ వార్త‌లు వెలువ‌డిన నేప‌థ్యంలో ఆమె దీనిపై స్పందించారు. మైక్రోమాక్స్ ఫౌండ‌ర్ రాహుల్ శ‌ర్మ‌ను (rahul sharma) 2016లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అసిన్. వీరికి అరిన్ (arin) అనే పాప కూడా ఉంది. అయితే ఉన్న‌ట్టుండి అసిన్ (asin) ఇన్‌స్టాగ్రామ్‌లో రాహుల్ శ‌ర్మ‌కు సంబంధించిన అన్ని ఫొటోలు డిలీట్ చేసేసారు. కేవ‌లం తాను ప్రెగ్నెంట్‌గా ఉన్న‌ప్పుడు ఇద్ద‌రూ చేతులు ప‌ట్టుకుని దిగిన ఫొటో త‌ప్ప మిగ‌తావ‌న్నీ డిలీట్ చేసేసారు. దాంతో వీరిద్ద‌రూ విడాకులు తీసుకోబోతున్నార‌న్న టాక్ మొద‌లైంది. దీనిపై అసిన్ స్పందించారు. “ఇద్ద‌రం స‌మ్మ‌ర్ హాలిడే ఎంజాయ్ చేస్తున్నా. ఇంత‌లో విడాకులు అంటూ రూమ‌ర్స్ వ‌చ్చాయి. నాకు రాహుల్‌కి పెళ్లి చేయాల‌ని ఇంట్లో వాళ్లు ప్లాన్ చేసుకుంటున్న‌ప్పుడు కూడా బ్రేకప్ అయిపోయింది అని రాసారు. కాస్త బెట‌ర్ న్యూస్ రాసుకోండి. అన‌వ‌ర‌స‌రంగా హాలిడేకి వ‌చ్చి ఈ రిప్లై ఇవ్వ‌డానికి 5 నిమిషాలు వేస్ట్ చేసుకున్నా” అని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా క్లారిఫై చేసేసారు అసిన్.