Ashwini Dutt: తారక్ సినిమాలు..44 కోట్లు నష్టపోయా
Hyderabad: వైజయంతీ మూవీస్(Vyjayanthi Movies) బ్యానర్‌పై ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన ప్రముఖ నిర్మాత అశ్వినీదత్(Ashwini Dutt). మహేశ్‌బాబు- రాజకుమారుడు, రామ్‌చరణ్- చిరుత, అల్లు అర్జున్- గంగోత్రి.. ఇలా ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ హీరోలుగా రాణిస్తున్న వారిని వెండితెరకు పరిచయం చేసింది ఆయనే. సీనియర్ ఎన్టీఆర్(Sr. NTR) సలహాతో వైజయంతి మూవీస్ అనే పేరున నిర్మాణ సంస్థను స్థాపించి ఎన్నో సినిమాలు తీసి నిర్మాతగా విజయం సాధించారు. కాగా, తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
‘పెళ్లి సందడి సినిమాను హిందీలో తీశాం. తర్వాత నేను, అరవింద్(Allu Arvind)గారు కలిసి అనిల్ కపూర్(Anil Kapoor)తో చూడాలని ఉంది(Chudaalani undi) మూవీ తీశాం. అప్పుడిద్దరికీ చెరో ఆరు కోట్లు పోయాయి. ఆ సినిమా వల్ల మొత్తం 12 కోట్లు నష్టం. జూనియర్ ఎన్టీఆర్(Jr. NTR) హీరోగా తెరకెక్కించిన శక్తి (Shakthi)సినిమా రిలీజైనప్పుడు చాలా డిసప్పాయింట్ అయ్యాను. అప్పుడే నాన్న చనిపోయారు. ఆ సినిమాతో 32 కోట్ల రూపాయలు నష్టపోయా. దెబ్బకి నాలుగైదు సంవత్సరాలు సినిమాలు తీయలేదు. మొత్తంగా ఇండస్ట్రీనే వదిలి వెళ్లిపోదామనుకున్నా. ఇక నా జీవితంలో ఆఖరి చిత్రం.. జగదేక వీరుడు అతిలోక సుందరి పార్ట్ 2’ అంటూ నిర్మాతగా ఆయన ఎదుర్కొన్న అనుభవాలు పంచుకున్నారు అశ్వినీ దత్. కాగా, ప్రస్తుతం అశ్వినీ దత్ కుమార్తె స్వప్న ‘స్వప్నా సినిమాస్’ పతాకంపై పలు సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన సీతారామం సినిమా ఈ నిర్మాణ సంస్థలో రూపొందినదే. దుల్కర్ సల్మాన్(Dulquer salman), మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం వైజయంతి మూవీస్, స్వప్నా మూవీస్ సంయుక్తంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కె సినిమాను నిర్మిస్తున్నారు.