Ashish Vidyarthi రెండో పెళ్లి.. మాజీ భార్య పోస్ట్ వైరల్
Hyderabad: ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్ధి (Ashish Vidyarthi) మళ్లీ పెళ్లి చేసుకుని అందరికీ షాకిచ్చిన సంగతి తెలిసిందే. 60 ఏళ్ల ఆశిష్..33 ఏళ్ల రుపాలి బారువా (rupali barua) అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. రుపాలి బారువా (rupali barua) అస్సాంకు చెందిన ఫ్యాషన్ ఎంట్రప్రెన్యూర్. అలనాటి నటి శకుంతల బారువా కూతురు. ఆశిష్ రెండో పెళ్లి చేసుకున్న నేపథ్యంలో ఆయన మొదటి భార్య, నటి రాజోషీ బారువా (rajoshi barua) పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. మన జీవితంలోకి సరైన వ్యక్తి వచ్చినప్పుడు వాళ్లపై మనకున్న ప్రేమను ప్రశ్నించరు. ఏది మనల్ని బాధిస్తుందో అది చెయ్యరు. అది గుర్తుపెట్టుకోండి అని పోస్ట్ చేసారు. దీనిని బట్టి చూస్తే ఇప్పటికీ ఆమెకు ఆశిష్ విద్యార్ధిపై ప్రేమ, గౌరవం ఉన్నాయని అర్థం అవుతోంది.
ఆశిష్ విద్యార్ధి, రాజోషీ దంపతులకు అర్థ్ బారువా అనే కుమారుడు కూడా ఉన్నాడు. అయితే వీరిద్దరూ కొంతకాలం క్రితం పర్సనల్ కారణాల వల్ల విడిపోయినట్లు తెలుస్తోంది. ఇకపోతే తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ వంటి భాషల్లో బోలెడు సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు ఆశిష్ విద్యార్ధి. తెలుగులో ఆయన ఎక్కువ విలన్ పాత్రల్లో నటించారు. పోకిరి (pokiri) సినిమాలో ఆయన విలన్‌గా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్‌లో నటించిన తీరు ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. అదుర్స్, ఆగడు, బాద్‌షా వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. రానా నాయుడు (rana naidu) వెబ్ సిరీస్‌లోనూ ఆశిష్ విద్యార్ధి (ashish vidyarthi) నటించారు. ఇందులో ఆయన వెంకటేష్ అన్న పాత్రను పోషించారు. సినిమాలతో పాటు ఫుడ్ బ్లాగింగ్ కూడా చేస్తుంటారు.