AS Ravikumar: ఆమెకు క‌సితో ముద్దుపెట్ట‌లేదుగా..!

ద‌ర్శ‌కుడు ఏ.ఎస్ ర‌వికుమార్ (as ravi kumar) హీరోయిన్ మ‌న్నారా చోప్రాను (mannara chopra) గ‌ట్టిగా ప‌ట్టుకోవ‌డ‌మే కాకుండా ఆమె అనుమ‌తి లేకుండా బుగ్గ‌పై కిస్ చేసి ఘ‌ట‌న వైర‌ల్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న తీసిన తిర‌గ‌బ‌డ‌రా సామి (tiragabadara sami) సినిమా ప్రెస్‌మీట్‌లో భాగంగా ఫోటోల‌కు పోజ్ ఇస్తూ.. మ‌న్నారాను ద‌గ్గ‌రగా ప‌ట్టుకోవ‌డ‌మే కాకుండా బుగ్గ‌పై ముద్దుపెట్టారు.

అయితే మ‌న్నారా సీరియ‌స్‌గా తీసుకోకుండా షాకైన‌ట్లు న‌వ్వి ఊరుకుంది. కానీ ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు, హీరోలు ఇలా ఎవ‌రైనా స‌రే హీరోయిన్ల విష‌యంలో ఇలాంటివి చేస్తే దిగ‌జారిపోతారు. గ‌తంలో ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ చోటా కే నాయుడు (chota k naidu) కూడా ఇలాగే చేసి నెగిటివిటీని కొనితెచ్చుకున్నారు. కాజ‌ల్ అగ‌ర్వాల్‌ని (kajal agarwal) పొగుడుతూ ఆమె న‌డుము ప‌ట్టుకుని మ‌రీ బుగ్గ‌పై ముద్దుపెట్టారు. ఆ ఘ‌ట‌న అప్ప‌ట్లో సంచ‌ల‌నంగా మారింది.

అయితే ఈ వివాదంపై ర‌వికుమార్ (as ravikumar) స్పందించారు. తానేమీ క‌సితో ముద్దుపెట్టుకోలేద‌ని.. త‌న‌కు కూతురు లాంటిది కాబ‌ట్టే అంత చ‌నువు తీసుకున్నాన‌ని తెలిపారు. త‌న భార్య‌కు, మ‌న్నారాకు లేని నొప్పి జ‌నాల‌కు ఎందుకు అని మండిప‌డ్డారు. అలా ముద్దు పెట్టుకోవ‌డంలో త‌న‌కు ఎలాంటి త‌ప్పు కనిపించ‌లేదు అని అన్నారు.