AS Ravi Kumar: హీరోయిన్‌ని కిస్ చేసిన డైరెక్ట‌ర్..!

తెలిసో తెలీకో కొన్ని సార్లు చేసే ప‌నుల వ‌ల్ల చిక్కుల్లో ప‌డాల్సి వ‌స్తుంది. ఈరోజుల్లో అన్నీ సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అయిపోతున్నాయ్‌.. ట్రోల్ అయిపోతున్నాయ్. ఓ మనిషిని ఆకాశానికి ఎత్తాల‌న్నా .. ప‌రువు తీయాల‌న్నా సోష‌ల్ మీడియానే వాడేస్తున్నారు. ఇప్పుడు ద‌ర్శ‌కుడు ఏ.ఎస్ ర‌వికుమార్ (as ravi kumar) ఈ సోష‌ల్ మీడియాకు దొరికేసారు. ఆయ‌న డైరెక్ట్ చేసిన తిర‌గ‌బ‌డ‌రా సామి (tiragabadara sami) ప్రెస్ మీట్ స‌మ‌యంలో.. హీరోయిన్ మ‌న్నారా చోప్రాను (mannara chopra) గ‌ట్టిగా ప‌ట్టుకోవ‌డ‌మే కాకుండా ఆమె అనుమ‌తి లేకుండా బుగ్గ‌పై కిస్ చేసారు.

అయితే మ‌న్నారా సీరియ‌స్‌గా తీసుకోకుండా షాకైన‌ట్లు న‌వ్వి ఊరుకుంది. కానీ ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు, హీరోలు ఇలా ఎవ‌రైనా స‌రే హీరోయిన్ల విష‌యంలో ఇలాంటివి చేస్తే దిగ‌జారిపోతారు. గ‌తంలో ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ చోటా కే నాయుడు (chota k naidu) కూడా ఇలాగే చేసి నెగిటివిటీని కొనితెచ్చుకున్నారు. కాజ‌ల్ అగ‌ర్వాల్‌ని (kajal agarwal) పొగుడుతూ ఆమె న‌డుము ప‌ట్టుకుని మ‌రీ బుగ్గ‌పై ముద్దుపెట్టారు. ఆ ఘ‌ట‌న అప్ప‌ట్లో సంచ‌ల‌నంగా మారింది.