Armaan Malik: అన‌గ‌న‌గ‌నగా.. ఆష్నా అట త‌న పేరు..!

అర‌వింద స‌మేత వీర రాఘ‌వ సినిమాలో అన‌గ‌న‌గ‌న‌గా.. అర‌విందట త‌న పేరు.. పాట గుర్తుందిగా. ఈ పాట పాడింది అర్మాన్ మాలిక్ (armaan malik). తెలుగులో ఎన్నో మంచి పాట‌ల‌ను పాడి అల‌రించిన అర్మాన్ త్వ‌రలో పెళ్లి పీట‌లు ఎక్క‌బోతున్నాడు. త‌న‌కు కాబోయే శ్రీమ‌తిని ప‌రిచ‌యం చేస్తూ బ్యూటిఫుల్ ఫోటో పోస్ట్ చేసాడు. ఆ అమ్మాయి పేరు ఆష్నా ష్రాఫ్ (aashna shroff). ఆష్నా సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌, బ్లాగ‌ర్. చాలా కాలంగా వీరిద్ద‌రూ ప్రేమ‌లో ఉన్నారు. కాగా.. ఈరోజు త‌న ప్రేమ‌ను మ‌రో అడుగు ముందు తీసుకెళ్ల‌బోతున్న‌ట్లు అర్మాన్ వెల్ల‌డించాడు. (armaan malik)

అర్మాన్ పాడిన తెలుగు పాటలు

బుట్ట బొమ్మ – అల‌వైకుంఠ‌పురంలో

అన‌గ‌న‌గ‌న‌గా – అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌

కోపంగా కోపంగా – మిస్ట‌ర్ మ‌జ్ను

గుచ్చే గులాబి – మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్

కంటి పాప – వ‌కీల్ సాబ్

బ్యూటిఫుల్ ల‌వ్ – నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా

నిన్నే నిన్నే – అశ్వ‌ద్థామ‌

విన్నానే విన్నానే – తొలిప్రేమ‌

క‌లిసుంటే – ఊర్వ‌శివో రాక్ష‌సివో