OG: నో డౌట్.. డబ్బింగ్ చెప్పేది నేనే..!
Hyderabad: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ (pawan kalyan) నటిస్తున్న OG సినిమాలో ఛాన్స్ కొట్టేసాడు కోలీవుడ్ స్టార్ అర్జున్ దాస్ (arjun das). అర్జున్ దాస్ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది సింహ గర్జన లాంటి ఆయన వాయిస్. ఇప్పుడు ఆయన OG సినిమాలో కీ రోల్లో నటిస్తున్నారు. అయితే పవన్ లాంటి సినిమాలో అర్జున్ లాంటి వాయిస్ ఉన్న వ్యక్తికి వేరొకరు డబ్బింగ్ చెప్తే ఏం కిక్ ఉంటుంది? అందుకే తన రోల్‌కి తనే డబ్బింగ్ చెప్పుకుంటున్నట్లు అర్జున్ దాస్ ప్రకటించారు. ఇక సినిమా విషయానికొస్తే.. సుజీత్ (sujeeth) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ (priyanka arul mohan) హీరోయిన్గా నటిస్తున్నారు. మూడో షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతున్నట్లు DVV ఎంటర్టైన్మెంట్స్ ప్రకటించింది. అల్యుమినియం ఫ్యాక్టరీలో 1950 బ్యాక్‌డ్రాప్‌తో పవన్ ఎంట్రీ సీన్‌ని షూట్ చేసినట్లు తెలుస్తోంది.