Sobhita Dhulipala: కాబోయే కోడలిపై అక్కినేని ఆంక్షలు?
Sobhita Dhulipala: త్వరలో శోభిత ధూళిపాల, నాగచైతన్యలు (Naga Chaitanya) వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. 2025లో వీరి వివాహం జరగబోతోంది. ఎప్పుడు, ఎక్కడ అనేది త్వరలో వెల్లడిస్తామని ఇటీవల చైతన్య వెల్లడించారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. శోభితపై అక్కినేని కుటుంబం ఆంక్షలు పెట్టింది అనే టాపిక్ ఇప్పుడు ప్రచారంలో ఉంది. శోభిత సినిమాలు చేసేది తక్కువ ఫోటో షూట్లు ఎక్కువ. ఈ విషయం ఆమె సోషల్ మీడియా చూస్తేనే అర్థమైపోతుంది.
ఆమె ఫోటో షూట్లలో కాస్త ఎక్స్‌పోజింగ్ పాయింట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. దాంతో ఈ ఫోటో షూట్లు వద్దు అని నాగార్జున (akkineni nagarjuna) హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీని వల్ల ఫ్యామిలీ పరువు పోతుందని కూడా అన్నట్లు టాక్ వినిపిస్తోంది. అందుకే శోభిత ఈ మధ్యకాలంలో ఫోటో షూట్ల కోసం వస్తున్న వారిని వెనక్కి పంపేస్తోందట. ఈ అంశంపై అక్కినేని సన్నిహిత వర్గాలు స్పందిస్తూ.. అందులో ఎలాంటి వాస్తవం లేదని.. ప్రొఫెషనల్‌గా ఎలా ఉండాలో అది శోభిత ఇష్టం అని అంటున్నారు.
ఒకప్పుడు శోభిత (sobhita dhulipala) అంటే ఎవ్వరికీ తెలిసేది కాదు. గూఢచారి సినిమాలో నటించి ఆ తర్వాత బాలీవుడ్‌లో వెబ్ సిరీస్‌లలో నటిస్తున్న ఓ సాధారణ హీరోయిన్ అని మాత్రమే ప్రేక్షకులకు తెలుసు. అలాంటి శోభితతో నాగచైతన్య ప్రేమాయణం నడిపిస్తాడని.. సడెన్‌గా నిశ్చితార్థం కూడా చేసేసుకుంటాడని ఎవ్వరూ ఊహించలేదు.
సమంతతో నాగచైతన్య విడిపోవడానికి కారణం సమంత (Samantha) ఫ్యామిలీ మ్యాన్ 2లో బోల్డ్ సీన్లలో నటించడం.. బోల్డ్ ఫోటో షూట్లలో పాల్గొనడమే అనే కామెంట్స్ చాలా వచ్చాయి. దాంతో ఇప్పుడు శోభిత విషయంలోనూ ఇదే చర్చ నడుస్తోంది. పైగా శోభిత ఫోటో షూట్లలో మరీ స్కిన్ షో చేస్తుంటారు. దాంతో సమంత లాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని కాస్త పద్ధతిగా ఉండటం నేర్చుకో అంటూ అక్కినేని అభిమానులు శోభిత ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ నీతులు చెప్తున్నారు.
నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి శోభితపై సామ్ అభిమానులు ఏ రేంజ్‌లో రెచ్చిపోయారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాగచైతన్య రాళ్లను వెతుక్కునే క్రమంలో వజ్రాన్ని కోల్పోయాడంటూ నీచంగా కామెంట్స్ చేసారు. ఎన్ని కామెంట్స్ చేసినా శోభిత మాత్రం తన ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్ సెక్షన్‌ను ఆఫ్ చేయలేదు. ఎలాంటి కామెంట్స్ కూడా ఆమె పట్టించుకోరు. తనకు నచ్చిన విధంగానే ఫోటోలు పోస్ట్ చేస్తుంటారు. నిశ్చితార్థం తర్వాత కూడా నాగచైతన్య ఎలాంటి ఫోటోలు పోస్ట్ చేయలేకపోయారు. కానీ శోభిత మాత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు షేర్ చేసుకున్నారు. వీరిద్దరి పెళ్లి విషయానికొస్తే రాజస్థాన్‌లో చేసుకుంటారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటి నుంచే గెస్ట్‌ల కోసం ఫైవ్ స్టార్ హోటల్స్ బుక్ చేసుకున్నారట.
ఇక ప్రొఫెషనల్ పరంగా చూస్తే.. నాగచైతన్య తండేల్ (Thandel) సినిమాతో బిజీగా ఉన్నారు. చై కెరీర్‌లోనే ఇది అతిపెద్ద సినిమాగా చెప్పుకోవాలి. మరోపక్క శోభిత నటించిన లవ్ సితార (Love Sitara) అనే వెబ్ సిరీస్ సెప్టెంబర్ 27న జీ5లో రిలీజ్ కానుంది.