Kalki 2898 AD: క‌ల్కి క‌లెక్ష‌న్లు ఫేకా?

are Kalki 2898 AD collections fake

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ న‌టించిన బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రం క‌ల్కి 2898 ఏడి. గ‌త గురువారం రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను ఒక ఊపు ఊపేస్తోంది. క‌ల్కి సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపిస్తోంద‌న్న విష‌యంలో ఏమాత్రం సందేహం లేదు. కానీ నిర్మాత‌లు చెప్తున్న క‌లెక్ష‌న్లు మాత్రం ఫేక్ అని అంటున్నారు ప్రముఖ ట్రేడ్ ఎన‌లిస్ట్ సుమిత్ క‌డేల్. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌స్తున్న క‌లెక్ష‌న్ల‌కు మ‌రో రూ.90 నుంచి రూ.100 కోట్లు అద‌నంగా వేసి క‌లెక్ష‌న్లు చూపిస్తున్నార‌ని ఆయ‌న ఆరోపిస్తున్నారు.

ఈ సినిమాకు ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.800 నుంచి రూ.850 కోట్లు వ‌సూళ్లు వ‌స్తాయ‌ని కానీ రూ.1000 కోట్లు క‌ష్టం అని అంటున్నారు. భార‌త్‌లో ఈ సినిమా రూ.370.2 కోట్లు రాబ‌ట్టింద‌ని.. దానిలో హిందీ మార్కెట్ షేర్ రూ.141 కోట్ల‌ని తెలిపారు. ఇక ప్ర‌పంచ‌వ్యాప్తంగా వ‌చ్చిన గ్రాస్ క‌లెక్ష‌న్లు రూ.600 కోట్లు ఉండొచ్చ‌ని అంచ‌నా. అయితే ఈ సినిమా ప‌ఠాన్, జ‌వాన్ క‌లెక్ష‌న్ల‌ను బీట్ చేయ‌డం మాత్రం అసాధ్య‌మ‌ని సుమిత్ చెప్తున్నారు. బాక్సాఫీస్ కలెక్ష‌న్ల‌ను ట్రాక్ చేసే ఒక సంస్థ ఇండియాలో లేద‌ని.. దాంతో నిర్మాత‌లు ఎంత చెప్తే అన్ని క‌లెక్ష‌న్లు వ‌చ్చాయ‌ని ప్రేక్ష‌కులు న‌మ్మేస్తున్నార‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.