Kajol అజయ్ విడాకులు తీసుకుంటున్నారా?
Mumbai: బాలీవుడ్ స్టార్ కపుల్ కాజోల్ (kajol), అజయ్ దేవగణ్ (ajay devgn) విడాకులు తీసుకుంటున్నారా? ఈరోజు కాజోల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ చూసి ఫ్యాన్స్ పెడుతున్న కామెంట్ ఇది. నా జీవితంలో అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటి ఎదుర్కొంటున్నాను అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసారు. అంతేకాదు.. ఇన్‌స్టాగ్రామ్‌లోని మిగతా పోస్టులన్నీ డిలీట్ చేసి బ్రేక్ తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అసలు ఉన్నట్టుండి కాజోల్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారా అని ఫ్యాన్స్ తెగ కంగారుపడ్డారు. కాజోల్ తన భర్తతో విడిపోతున్నారేమో అందుకే ఇలాంటి పోస్ట్ పెట్టారేమో అని నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో విడాకుల గురించి ప్రకటించడానికి ముందు ఇన్‌స్టాగ్రామ్‌లోని ఫొటోలు డిలీట్ చేయడం, ఒకరిని ఒకరు అన్‌ఫాలో అవడం చేస్తున్నారు. దాంతో కాజోల్ కూడా అందుకే ఇలా చేసిందేమో అనుకుంటున్నారు. అయితే కాజోల్ నటించిన ది ట్రయల్- ప్యార్ ఖానూన్ ధోకా వెబ్‌సిరీస్ త్వరలో డిస్నీ హాట్‌స్టార్‌లో రిలీజ్ అవబోతోంది. ఈ వెబ్‌సిరీస్ ప్రమోషన్ కోసం అలాంటి పోస్ట్ పెట్టారేమో అని కూడా వాదనలు వినిపిస్తున్నాయి. అసలు ప్రమోషన్స్ కోసం సెలబ్రిటీలు సోషల్ మీడియాలోని పోస్ట్‌లు ఎందుకు డిలీట్ చేస్తారో ఇప్పటికీ అర్థంకాని విషయం.