Arbaaz Khan: అటు భార్య.. ఇటు ప్రేయసి.. చివరికి మేకప్ ఆర్టిస్ట్‌తో పెళ్లి
Arbaaz Khan: సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ వైవాహిక జీవితం ఎన్నో ట్విస్ట్‌ల మయం. మలైకా అరోనాను (malaika arora) ప్రేమించి పెళ్లి చేసుకుని ఓ బిడ్డను కన్న అర్బాజ్ ఆ తర్వాత ఆమెతో గొడవలు వచ్చి విడిపోయాడు. ఆ తర్వాత అర్బాజ్ జార్జియా ఆండ్రియానీ (georgia andriani) అనే మోడల్‌తో లివిన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు. జార్జియా ముంబైలో అర్బాజ్‌తో కలిసి ఉండేది.
ఆ తర్వాత ఆమెతో కూడా బ్రేకప్ అయ్యింది. ఇక ఏం చేయాలో తెలీక పాపం షూరా ఖాన్ అనే తన మేకప్ ఆర్టిస్ట్‌నే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు అర్బాజ్. రేపు మాపో వీరిద్దరూ కుటుంబీకుల సమక్షంలో పెళ్లి చేసుకోబోతున్నారు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) నటించిన జై చిరంజీవ (jai chiranjeeva) సినిమాలో అర్బాజ్ విలన్ పాత్రలో నటించారు. తన సోదరుడు సల్మాన్ ఖాన్ లాగా పెళ్లి చేసుకోకుండా కెరీర్‌పై ఫోకస్ చేసినా బాగుండు..!