AR Rahman పాటలు విని సూసైడ్ వద్దనుకున్నా
Chennai: ఏ ఆర్ రెహమాన్ (ar rahman) సాంగ్స్ విన్నాకే సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన పోయిందంటూ షాకింగ్ కామెంట్స్ చేసారు మ్యూజిక్ ప్రొడ్యూసర్ సెల్వకుమార్ (selva kumar). మలేషియాకు చెందిన మ్యూజిక్ ప్రొడ్యూసర్ చేసిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. ఆయన కొన్ని నెలల క్రితం చనిపోవాలని నిర్ణయించుకున్నారట. కానీ ఏ ఆర్ రెహమాన్ పాటలు విని ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నానని తెలిపారు.
ఆయన ఏమని ట్వీట్ చేసారంటే.. “డియర్ గురు రెహమాన్..2015 ఏప్రిల్ 4న అర్థరాత్రి నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. నేను చనిపోవడానికి క్షణం ముందు నా ఫ్రెండ్ ఫోన్ చేసి మీరు మ్యూజిక్ అందించిన ఓకే కన్మణిలోని పాటలు విను అని చెప్పాడు. సరే అని విన్నాను. అవి విన్నాక చనిపోవాలనుకున్న నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. నా గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాను. ఒక 48 గంటల పాటు హెడ్ఫోన్స్ పెట్టుకుని ఓకే కన్మణి సినిమాలోని పాటలు వింటూ కూర్చుండిపోయాను. ఇప్పుడు నాకు ఓకే కన్మణి సినిమాలోని చినాన్జిర్రు పాట కేవలం పాట మాత్రమే కాదు. అవి నాకు మరో జీవితంతో సమానం. మ్యూజిక్ కెరీర్లో ఎన్నో ఫెయిల్యూర్స్ చూసి చనిపోవాలనుకున్న నాకు ఇలా జీవితాన్ని అర్థాంతరంగా ముగించేయడం సరికాదు అనిపించింది. థ్యాంక్యూ రెహమాన్ సర్“ అని ట్వీట్ చేసాడు. అంతేకాదు రెహమాన్ పేరుని చేతిపై టాటూగా కూడా వేయించుకున్నాడు. ఈ ట్వీట్స్ చూసిన రెహమాన్.. (ar rahman) అంతా దేవుడి దయ. జాగ్రత్తగా జీవించు అని రిప్లై ఇచ్చారు.