AR Rahman: ఆ రోజుల్ని ఎప్పటికీ మర్చిపోలేను!

Hyderabad: రాజ్​-కోటి(Raj-Koti)) ద్వయంలో ఒకరైన రాజ్(Raj)​ మే 21న మరణించిన విషయం తెలిసిందే. 80ల్లో రాజ్​, కోటితో కలిసి దాదాపు 180 సినిమాలకు సంగీతం అందించారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఎన్నో సినిమాలు సూపర్​ హిట్లుగా నిలిచాయి. కాగా, కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజ్​ ఆదివారం గుండెపోటుతో హైదరాబాద్​లో కన్నుమూశారు. రాజ్​ మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు AR రెహమాన్(AR Rahman) సోషల్​ మీడియా వేదికగా రాజ్‌కి నివాళి అర్పించి తాను రాజ్​తో పనిచేసిన రోజులను గుర్తు చేసుకున్నారు.

‘రెస్ట్ ఇన్ పీస్ సోమరాజు గారూ, 80లలో రాజ్ – కోటితో కలిసి పనిచేసిన జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోలేను’ అని ట్వీట్ చేశారు రెహమాన్. మ్యూజిక్​ డైరెక్టర్​గా మారడానికి ముందు రెహమాన్ రాజ్ – కోటి ద్వయంతో 8 సంవత్సరాలు కీబోర్డ్ ప్లేయర్, ప్రోగ్రామర్‌గా పనిచేశారు. రాజ్ – కోటితో తన అనుబంధాన్ని అనేక ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. స్లమ్‌డాగ్ మిలియనీర్ కోసం రెహమాన్ ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు అందుకున్నప్పుడు కూడా రాజ్, కోటి కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.