తమిళంలో మాట్లాడు.. భార్యకు చెప్పిన రెహమాన్
Hyderabad: ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్ రెహమాన్(ar rahman).. తమిళం(tamil)లో మాట్లాడు అని తన భార్యతో చెప్పడం వైరల్ అవుతోంది. ఇటీవల తమిళనాడు(tamilnadu)లో జరిగిన ఓ అవార్డుల ఈవెంట్లో రెహమాన్ తన భార్య సైరా బాను(saira banu)తో కలిసి వెళ్లారు. అవార్డు తీసుకున్నాక ఆయన మాట్లాడుతూ.. “నేను నా ఇంటర్వ్యూలు అస్సలు చూసుకోను. కానీ నా భార్య మాటిమాటికీ ప్లే చేస్తుంది. ఎందుకంటే తనకు నా వాయిస్ అంటే ఎంతో ఇష్టం” అన్నారు. ఆ తర్వాత మైక్‌ను తన భార్యకు ఇచ్చారు. అమె హిందీలో మాట్లాతుందేమోనని తమిళంలోనే మాట్లాడు అని చెప్పారు. సైరాకు తమిళం సరిగ్గా రాదు. అయితే స్టేజ్‌పై రెహమాన్ తన భార్యతో అలా చెప్పడం కొందరు నెటిజన్లకు నచ్చినట్లు లేదు. ఫలానా భాషలో మాట్లాడమని ఫోర్స్ చేయాల్సిన అవసరం ఏముంది అంటూ రెహమాన్‌ని ట్యాగ్ చేసి మరీ కామెంట్లు పెడుతున్నారు. దాంతో ఆమె కాస్త అసౌకర్యానికి గురయ్యారు. “క్షమించండి. నాకు తమిళం సరిగ్గా రాదు. తప్పుగా అనుకోకండి. నాకు రెహమాన్ వాయిస్ అంటే ఎంతో ఇష్టం” అని చెప్పారు. 2021లో ఇలాంటి ఓ సంఘటన కారణంగా రెహమాన్ కాంట్రొవర్సీలో ఇరుక్కున్నారు. ఓ అవార్డుల కార్యక్రమంలో యాంకర్ హిందీలో మాట్లాడటం విని రెహమాన్ కోపంలో స్టేజ్ దిగి వెళ్లిపోతున్నట్లు ప్రవర్తించారు. ఆ తర్వాత మళ్లీ వెనక్కి వచ్చి జోక్ చేసానని చెప్పారు.