Anushka Shetty: ఉపాసనతో కలిసి చూడండి చరణ్​!

Hyderabad: టాలీవుడ్​ జేజమ్మ అనుష్క శెట్టి(Anushka Shetty), యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty) జంటగా నటిస్తున్న చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి(Ms Shetty Mr Polishetty )’. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ గా రాబోతున్న ఈ చిత్రానికి పి.మహేష్ బాబు(P. Maheshbabu) దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ మూవీ టీజర్ ఇటీవల రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ప్రొఫెషనల్​ షెఫ్​గా అనుష్క కనిపించగా స్టాండప్​ కమెడియన్​గా నవీన్​ పొలిశెట్టి కనిపించారు. ఈ టీజర్ ‎లోని సీన్స్ రిఫ్రెషింగ్ గా ఉండడమే కాకుండా మంచి కామెడీ కూడా ఉంది. దీంతో ఆడియన్స్‎కి ఈ టీజర్ విపరీతంగా నచ్చేసింది. అభిమానులతోపాటు స్టార్​ హీరోలూ ఈ టీజర్​పై స్పందిస్తూ అనుష్కకు, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇటీవలే యంగ్​ రెబల్​ స్టార్​ ప్రభాస్(Prabhas)​ అనుష్కకి ఆల్​ ది బెస్ట్​ చెప్పగా, తాజాగా మెగా పవర్​స్టార్​ రామ్​ చరణ్(Ram Charan)​ కూడా ఈ చిత్రబృందానికి సోషల్​ మీడియా వేదికగా అభినందలు తెలిపారు.
ఇక చెర్రీ పోస్ట్​కి స్వీటీ కూడా ఓ బ్యూటిఫుల్ రిప్లై ఇచ్చింది. ‘సో స్వీట్ ఆఫ్ యు చరణ్ అంటూ..మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ని భార్య ఉపాసన(Upasana) తో కలిసి తప్పకుండా చూడండి’ అంటూ థాంక్స్ చెప్పింది. దీనితో చరణ్ కి అనుష్క ఇచ్చిన ఈ క్యూట్ రిప్లై ఇప్పుడు వైరల్ గా మారింది. రామ్ చరణ్ కి నవీన్ పోలిశెట్టి ఇచ్చిన రిప్లై అందర్నీ ఆకట్టుకుంటుంది. ‘మీ ట్వీట్ చూసి మాకు తెలియకుండానే నాటు నాటు స్టెప్ వేస్తున్నాము. సినిమాల్లో మీ నిర్ణయాలతో గేమ్ చెంజర్ గా ఉండి మాకు స్ఫూర్తిని ఇస్తునందుకు థాంక్యూ రామ్ చరణ్ గారు’ అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుండగా, తెలుగు, తమిళ్, మళయాళ కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.