Prabhasని అనుష్క ఏమని పిలుస్తుందో తెలుసా!
Hyderabad: వెండితెరపై యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), అనుష్క (Anushka Shetty)ది సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులకు చాలా ఇష్టం. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ, పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ప్రభాస్, అనుష్క మాత్రం తాము మంచి స్నేహితులమే తప్ప మరేం లేదంటూ చాలాసార్లు క్లారిటీ ఇచ్చారు. అయినా.. వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలనుకునే అభిమానులు చాలామంది ఉన్నారు. అందుకే వీరిద్దరికీ సంబంధించిన ఏ చిన్న వార్త బయటికొచ్చినా వెంటన్ వైరల్ అవుతుంది. తాజాగా ప్రభాస్, అనుష్క ఇన్‌స్టా చాట్ వైరల్‌గా మారింది.
అనుష్క, నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) కలిసి నటిస్తున్న చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty). తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ అయ్యింది. టీజర్ చూసిన ప్రభాస్ మూవీ టీంని కంగ్రాట్యులేట్ చేస్తూ పోస్ట్ వేశాడు. దీనికి అనుష్క రెస్పాండ్ అవుతూ.. “Thank you Pupsuu” అంటూ కామెంట్ చేసింది. అయితే ప్రభాస్ అందర్నీ ముద్దుగా డార్లింగ్ అని పిలుస్తుంటాడని తెలిసిందే. ప్రభాస్‌ని కూడా అందరు డార్లింగ్ ప్రభాస్ అంటూ ముద్దుగా పిలుస్తుంటారు. అయితే అనుష్క మాత్రం ప్రభాస్ ని ముద్దుగా పప్స్ అని పిలుస్తుందని తెలిసిపోయింది. ఇక ఇది చూసిన అభిమానులు అనుష్క, ప్రభాస్ ని ‘పుప్సు’ అని ముద్దుగా పిలుస్తుంది అనుకుంటా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది.