Anushka Sharma: బిడ్డ పుట్టాక తొలి పోస్ట్ పెట్టిన అనుష్క‌

Anushka Sharma: బాలీవుడ్ న‌టి అనుష్క శ‌ర్మ ఇటీవ‌ల పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన సంగ‌తి తెలిసిందే. బాబుకు అకాయ్ (Akaai) అని పేరు పెట్టిన‌ట్లు వెల్ల‌డిస్తూ అభిమానుల‌కు శుభ‌వార్త తెలిపారు. అయితే రెండో బిడ్డ విష‌యంలో అనుష్క‌, విరాట్ కోహ్లీ దంప‌తులు చాలా గోప్యంగా ఉండాల‌నుకున్నారు. అందుకే ఈసారి డెలివ‌రీ ఇండియాలో కాకుండా లండ‌న్‌లో జ‌రగాల‌ని అనుకున్నారు. ఈ నేప‌థ్యంలో చాలా కాలం త‌ర్వాత అనుష్క త‌న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసారు. కాక‌పోతే వ‌న్ ప్ల‌స్ ఇండియాతో భాగ‌స్వామ్యం అయిన నేప‌థ్యంలో వ‌న్ ప్ల‌స్ ఫోన్‌ను ప్ర‌చారం చేసేందుకు ఈ ఫోటో పెట్టారు.

ఇక‌పోతే.. అనుష్క ప్రస్తుతానికి ఎలాంటి సినిమాల‌ను ఒప్పుకోవ‌డంలేదు. వివాహం త‌ర్వాత పిల్ల‌లు పుడితే సినిమాలు చేయ‌డం మానేస్తాన‌ని త‌న కెరీర్ ఆరంభంలోనే అనుష్క ఓ క్లారిటీ ఇచ్చేసారు. ప్ర‌స్తుతం త‌న నిర్మాణ సంస్థ అయిన క్లీన్ స్లేట్ ఫిలింస్ నుంచి మాజీ మ‌హిళా క్రికెట‌ర్ ఝుల‌న్ గోస్వామి బ‌యోపిక్‌లో అనుష్క న‌టిస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.