Anushka: పెళ్లి చేసుకుంటా కానీ..
30 దాటినా ఇంకా పెళ్లి చేసుకోలేదు మన అనుష్క (anushka). కానీ పెళ్లి వ్యవస్థపై మాత్రం తనకు అపారమైన నమ్మకం ఉందని అంటోంది. కాకపోతే అది నేచురల్‌గా జరగాలి కానీ చేసుకోవాలి కాబట్టి చేసుకున్నాం అన్నట్లు ఉండకూడదు అని అంటున్నారు అనుష్క. ఆమె నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా ఈ వారం రిలీజ్ అవుతున్న సందర్భంగా స్వీటీ శెట్టి చెప్పిన ముచ్చట్లు ఆమె మాటల్లోనే…
“” కొన్నేళ్ల క్రితం డైరెక్టర్ మహేష్ నా దగ్గరికి ఈ కథతో వచ్చారు. అయితే ఇందులో నన్ను తీసుకోవాలన్న ఉద్దేశంతో ఆయన నా దగ్గరికి రాలేదు. కథ మొత్తం విన్నాక అన్విత క్యారెక్టర్ నాకెంతో నచ్చింది. ఇంకా ఎవ్వరికీ ఈ కథ చెప్పలేదు అని మహేష్ అనడంతో నేను చేస్తానని అన్నాను. దానికి ఆయన కూడా హ్యాపీగా ఫీలయ్యారు. ఇన్నేళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉంటున్నా కూడా ఇప్పటికీ సెట్స్‌లో అడుగుపెట్టాలంటే వణుకే. సరిగ్గా నటిస్తానా? డైరెక్టర్‌కి నమ్మకాన్ని నిలబెడతానా? అన్న భయం ఇప్పటికీ ఉంది. ఏదీ ప్లాన్ చేసుకునే బ్రెయిన్ నాకు లేదు కాబట్టే నేను ఇంత సక్సెస్ అయ్యాననే అనుకుంటాను. ఎప్పటికీ ఒకే మైండ్‌సెట్‌లో ఉండిపోతే జీవితంలో గెలవలేం. నేను ఇదే రూల్ పాటిస్తాను. ఈ మధ్య ఎక్కడికి వెళ్లినా సినిమాలు మానేసారా అని అడుగుతున్నాను. నేను రుద్రమదేవి, దేవసేన, భాగమతి లాంటి పవర్‌ఫుల్ లేడీ క్యారెక్టర్లలో నటించాను. దాంతో నాకు వచ్చే స్క్రిప్ట్స్ అన్నీ అలాగే ఉంటున్నాయి. అందుకే నిశ్శబ్దం తర్వాత కథ ఓకే చేయడానికి ఇంత టైం పట్టింది “”
“” ఇక ప్యాన్ ఇండియా సినిమాల గురించి చెప్పాలంటే మంచి సినిమాలను బౌండరీలు అడ్డులేవు. భాష ఏదైనా ఆ భావం, ఆ ఎమోషన్ ఒక్కటే. ఇప్పటికైతే సినిమాల్లో నటించడమే హ్యాపీగా ఉంది. డైరెక్షన్ ప్రొడక్షన్ గురించి ఆలోచించడం లేదు. ఇక పెళ్లి గురించి చెప్పాలంటే చేసుకోవాలనే ఉంది. ఒక ఫ్యామిలీ కావాలని నాకూ ఉంది. కానీ ఈ పెళ్లి అనేది సహజంగా జరిగేనే బాగుంటుంది. వయసు అయిపోతోందని చేసుకోవాలని కాబట్టి చేసుకున్నట్లు ఉండకూడదు “” అని అంటున్నారు మిస్ శెట్టి. (anushka)