Anurag Kashyap: కూతురి పెళ్లి కోసం ఎన్ని రీమేక్‌లు చేయాలో..!
France: బాలీవుడ్(Bollywood) ప్రముఖ దర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్(Anurag Kashyap) కూతురు ఆలియా కశ్యప్(aaliyah kashyap) పెళ్లి కబురు చెప్పింది. గత కొంతకాలంగా షేన్ గ్రెగోయిర్(Shane Gregoire), ఆలియా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. రెండేళ్ల కిందటే వీళ్ల ప్రేమను అధికారికంగా ప్రకటించించి తన వేలికి ఉంగరం తొడిగే రోజుకోసం వేచి చూస్తున్నా అంటూ రాసుకొచ్చాడు షేన్. ఇక తాజాగా ఆ ముచ్చట కాస్తా జరిగింది. ఈ విషయాన్ని ఇద్దరూ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
‘నా బెస్ట్ ఫ్రెండ్, నా పార్ట్‌నర్, నా సోల్‌మేట్ ఇప్పుడు కాబోయే భర్త అయ్యాడు. నా జీవితానికి దొరికిన అమూల్యమైన ప్రేమవు నీవే.. అసలు సిసలైన ప్రేమ ఎలా ఉంటుందో చూపించినందుకు థ్యాంక్స్. నీ ప్రపోజల్‌కు ఎస్ చెప్పడం నేను చేసినవాటిలో అత్యంత సులువైన పని. నీతో జీవితాన్ని కొనసాగించడానికి ఆతృతగా ఎదురుచూస్తున్నాను. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నిన్ను ఫియాన్సీ అని పిలిచే రోజు వచ్చిందంటే నమ్మలేకపోతున్నాను’ అని రాసుకొచ్చింది ఆలియా.
కాగా, ఈ విషయాన్ని అనురాగ్ కూడా అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం 76వ కేన్స్ వేడుకల్లో పాల్గొంటున్న అనురాగ్ ‘ఇక్కడైనా ఫోన్ వదిలెయ్.. అంటున్నారు. నేను నా కూతురు పెళ్లి ఖర్చు లెక్క సరిపెట్టడానికి ఎన్ని రీమేక్‌లు చేయాలా అని లెక్కేసుకుంటున్నాను’ అంటూ సరదాగా రాసుకొచ్చారు అనురాగ్ కశ్యప్.
యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ అయిన ఆలియా కశ్యప్ ప్రస్తుతం తన బాయ్‌ఫ్రెండ్స్‌తో కలిసి ఇండోనేషియాలోని బాలి వెకేషన్లో ఉంది. కాగా, జాన్వీ కపూర్, శోభితా ధూళిపాళ, షానాయ కపూర్, కల్కి కోచ్లిన్ మరియు భూమి పెడ్నేకర్‌తో సహా ప్రముఖులు సోషల్ మీడియా సైట్‌లో కొత్తగా నిశ్చితార్థం చేసుకున్న జంటకు శుభాకాంక్షలు తెలిపారు.