Anurag Kashyap: పోర్న్ ఇండస్ట్రీని ఆకాశానికెత్తేసిన దర్శకుడు
Anurag Kashyap: బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ ఏదైనా ముక్కు సూటిగా మాట్లాడేస్తుంటారు. ఆయన్ను బాలీవుడ్ రామ్ గోపాల్ వర్మ అంటుంటారు. ఎందుకంటే వీరిద్దరి టేకింగ్ స్టైల్, టాకింగ్ స్టైల్ ఒకేలా ఉంటుంది. అయితే ఇప్పుడు అనురాగ్ కశ్యప్ పోర్న్ ఇండస్ట్రీపై పడ్డారు. అసలు పోర్న్ ఇండస్ట్రీ అంటే… అంటూ ఆ ఇండస్ట్రీని ఆకాశానికెత్తేసారు. పోర్న్ ఇండస్ట్రీలో టెక్నాలజీ అనేది బాగా అభివృద్ధి చెందిందని అన్నారు. ఆ ఇండస్ట్రీలో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని వాడతారని ఓ ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించారు.
“” మీరు ఏ డిజిటల్ అడ్వాన్స్‌మెంట్‌ని అయినా తీసుకోండి. ముందు దానిని పోర్న్ ఇండస్ట్రీలోనే వాడి ఉంటారు. VCR, DVDలను కూడా ముందు పోర్న్ ఇండస్ట్రీలోనే వాడారు. ఆ తర్వాతే అవి సినిమా ఇండస్ట్రీకి వచ్చాయి. ఆ తర్వాత ఆన్‌లైన్ స్ట్రీమింగ్ వచ్చింది. ఈ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ కూడా పోర్న్ నుంచే పుట్టుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ అంశంలో పోర్న్ ఇండస్ట్రీనే ముందంజలో ఉందని చెప్పాలి. అంతెందుకు HD స్ట్రీమింగ్, వీఆర్ అనుభూతి అనేవి కూడా పోర్న్ నుంచే వచ్చాయి “” అని తెలిపారు.