Anupama: రామ్ పోతినేనితో పెళ్లి.. నటి తల్లి రియాక్షన్
అనుపమ పరమేశ్వరన్‌కు (anupama) రామ్ పోతినేనితో (ram pothineni) పెళ్లంటూ వస్తున్న వార్తలపై స్పందించారు నటి తల్లి సునిత. అసలు ఉన్నట్టుండి ఈ వార్తలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయో తెలీడంలేదని ఆమె మండిపడ్డారు. రామ్, అనుపమ కలిసి ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమ కోసమే సినిమాల్లో నటించారు. అనుపమ నటించిన టిల్లు స్క్వేర్ (tillu square) సినిమా నవంబర్ 10న రిలీజ్ అవనుంది.