Sekhar Master: శేఖ‌ర్ మాస్ట‌ర్ ఇంట్లో మ‌రో విషాదం

another tragedy hits sekhar master

Sekhar Master: ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ శేఖర్ మాస్ట‌ర్ నివాసంలో మ‌రో విషాదం చోటుచేసుకుంది. మూడు నెల‌ల క్రిత‌మే శేఖ‌ర్ మాస్ట‌ర్ వ‌దిన అనారోగ్యంతో క‌న్నుమూసారు. ఆ విషాదం నుంచి కోలుకోకముందే మ‌రో విషాదం చోటుచేసుకుంది. ఆయన సోద‌రుడు నిన్న రాత్రి హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. ఈ విష‌యాన్ని శేఖ‌ర్ మాస్ట‌ర్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్ల‌డిస్తూ త‌న సోద‌రుడికి నివాళులు అర్పించారు. నేను ఎక్క‌డున్నా నిన్ను మాత్రం అస్స‌లు మ‌ర్చిపోలేను. నువ్వు లేవ‌న్న నిజాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నాను. మిస్ యూ సుధా అని పోస్ట్ చేసారు.