Adipurush: తెరపైకి మరో వివాదం !
Mumbai: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ ఆదిపురుష్(Adipurush). రామాయణం(Ramayanam) ఆధారంగా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్(Om Raut) రూపొందిస్తున్న ఈ సినిమా జూన్ 16న విడుదల కానుంది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్(Kriti Sanon) సీతగా, సైఫ్ అలీఖాన్(Saif alikhan) రావణుడిగా నటిస్తున్నారు. కాగా ఈ సినిమా ఆరంభం నుంచే వరుస వివాదాలను ఎదుర్కొంటోంది. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ వివాదాల బారిన పడ్డాయి. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ కూడా వివాదంలో చిక్కుకుంది.
ఆదిపురుష్ ట్రైలర్ అన్ని భాషల్లోనూ అదిరిపోయే రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. కాగా ఈ సినిమాపై సెన్సార్ బోర్డ్ మెంబరే మేకర్స్ తీరుకు వ్యతిరేకంగా బాంబే హైకోర్టు మెట్లక్కడం ఇప్పుడు అందర్నీ షాకయ్యేలా చేసింది. బాలీవుడ్‌లో ఇదే బిగ్ టాపిక్ గా మారింది. సెన్సార్ బోర్డ్ సర్టిఫికేషన్ కాకముందే మేకర్స్ ఈ సినిమా స్క్రీనింగ్ ఏర్పాటు చేయడాన్ని తప్పుబట్టిన ఈయన బాంబే హైకోర్ట్ న్యాయవాదులైన ఆవిష్ రాయ్, పంకజ్ మిశ్రాలతో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సినిమా విషయంలో ఎవ్వరి మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలంటే, వివాదాలు, విమర్శలు రాకుండా ఉండాలంటే, సెన్సార్ బోర్డ్ సర్టిఫికేషన్ తర్వాతే ఈ మూవీని స్క్రీనింగ్ చేసేలా మేకర్స్ ను ఆదేశించాలని సంజయ్ తన పిటిషన్లో కోరారు. మరి ఈ పిటిషన్‌పై కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.