Sophia Leone: పోర్న్ స్టార్‌ల వ‌రుస మ‌ర‌ణాలు..!

Sophia Leone: ఈ మ‌ధ్య‌కాలంలో పోర్న్ స్టార్ల మ‌ర‌ణాలు ఎక్క‌వ అవుతున్నాయి. సోఫియా లియోనీ అనే పోర్న్ స్టార్ మ‌ర‌ణ వార్త తాజాగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 26 ఏళ్ల సోఫియా లియోనీ మెక్సికోలోని త‌న నివాసంలో చ‌నిపోయారు. మార్చి 1న ఆమె త‌న ఇంట్లో విగ‌త జీవిగా ప‌డి ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు. ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకున్నారా లేక ఎవ‌రైనా ఇంట్లోకి ప్ర‌వేశించి ఆమెను చంపేసారా అనే కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు. మూడు నెల‌ల్లో దాదాపు న‌లుగురు పోర్న్ స్టార్స్ చ‌నిపోవ‌డం గ‌మ‌నార్హం. నెల రోజుల క్రితం జెస్సీ జేన్ అనే 43 ఏళ్ల పోర్న్ స్టార్స్ డ్ర‌గ్స్ వాడకం ఎక్క‌వై చనిపోయంది. అంత‌కుముందు నెల‌లో కాగ్నే లిన్ కార్ట‌ర్ అనే 36 ఏళ్ల పోర్న్ స్టార్ ఆత్మ‌హ‌త్య చేసుకుని చ‌నిపోయింది. వీరితో పాటు తైనా ఫీల్డ్స్, ఎమీలీ విల్లిస్ అనే పోర్న్ స్టార్స్ కూడా నెల‌ల వ్య‌వ‌ధిలో చనిపోయారు.