Guntur Kaaram: ఇంకొకరు ఔట్..?
Hyderabad: సూపర్‌స్టార్ మహేష్ బాబు (mahesh babu).. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (trivikram srinivas) కాంబినేషన్‌లో వస్తున్న సినిమా గుంటూరు కారం (guntur kaaram). సినిమా స్క్రిప్ట్ రాస్తున్నప్పుడే ఇందులో హీరోయిన్‌గా పూజా హెగ్డేని (pooja hegde) పెట్టాలని గురూజీ నిర్ణయించుకున్నారు. షూటింగ్ సగం అయిపోయింది అనుకున్న సమయంలో కొన్ని కారణాల వల్ల హీరోయిన్‌గా పూజను తీసేస్తున్నట్లు టీం ప్రకటించింది.
అప్పటికే సెకండ్ హీరోయిన్‌గా ఫిక్స్ అయిన శ్రీలీలను (sreeleela) మెయిన్ హీరోయిన్‌గా పెట్టనున్నట్లు టాక్ నడుస్తోంది. ఆ తర్వాత మెయిన్ హీరోయిన్‌గా మీనాక్షి చౌదరిని (meenakshi chowdary) పెడుతున్నారని కూడా రూమర్స్ వచ్చాయి. ఈ రచ్చ జరుగుతున్న సమయంలోనే కొన్ని రోజులు రిలాక్స్ అయ్యి వస్తానని మహేష్ బాబు తన ఫ్యామిలీతో ట్రిప్‌కి వెళ్లి వచ్చారు. కొన్ని రోజుల నుంచి షూటింగ్ ఫాస్ట్ ఫాస్ట్‌గా జరిగిపోతోంది (guntur kaaram)
హైదరాబాద్‌లోని BHELలో భారీ యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్న ఫొటో కూడా బయటికి వచ్చింది. ఇంతకీ ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే.. సినిమాలో (guntur kaaram) నుంచి మరో యాక్టర్ డ్రాప్ అయినట్లు టాక్ నడుస్తోంది. ఇంతకీ ఎవరా యాక్టర్ అనేది తెలీలేదు. అసలు మహేష్‌కి (mahesh) ఈ సినిమా చేయడం ఇష్టం ఉందో లేదో అన్న అనుమానాలు వస్తున్నాయి. త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్‌లో వచ్చిన ఖలేజా (khaleja) సినిమా రిలీజ్ అయినప్పుడు ఆడలేదు కానీ ఇప్పుడు ఆ సినిమాకు ఉన్న క్రేజ్ మామూలుగా లేదు.
ఆ సినిమా తర్వాత మళ్లీ ఇద్దరూ కలిసింది గుంటూరు కారం (guntur kaaram) సినిమాకే. ఏ ముహూర్తాన ఈ సినిమాను ప్రకటించారో కానీ అన్నీ అవాంతరాలే. అసలు అనుకున్న టైంకి సినిమా రిలీజ్ అవుతుందో లేదో అన్న సందేహాలు కూడా ఉన్నాయి. దాంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. గుంటూరు కారం సినిమా నుంచి కొంపతీసి మహేష్ బాబునే (mahesh babu) తీసేసారేమో అనే రేంజ్‌లో ట్రోల్స్ పేలుతున్నాయి. ఇంతకీ ఇప్పుడు ఏ యాక్టర్ సినిమా నుంచి ఔట్ అయ్యారో తెలీయాలంటే టీం నుంచి క్లారిటీ రావాలి.
మరో విషయం ఏంటంటే.. గుంటూరు కారం (guntur kaaram) అని టైటిల్ ఫిక్స్ చేసి టీజర్ రిలీజ్ అయ్యాక కూడా చాలా మంది ఈ సినిమా పేరు తెలీక SSMB 28 అనే ట్యాగ్ చేస్తున్నారట. అంటే టైటిల్ ట్రెండింగ్ ఏ రేంజ్‌లో జరిగిందో ఇక్కడే అర్థమైపోతోంది అంటూ ట్రోల్స్ వస్తున్నాయి. అసలు పూజను తీసేస్తున్నట్లు కూడా టీం నుంచి అఫీషియల్ క్లారిటీ రాలేదు. ఏదో అఫీషియల్ అకౌంట్స్ నుంచి ట్వీట్స్ వస్తే తప్ప పూజ సినిమాలో లేదన్న విషయం తెలీలేదు.
పూజకు తెలుగులో సినిమాలు చేయడం ఇష్టంలేదని అందుకే బాలీవుడ్ సినిమాలు ఒప్పుకోవాలన్న ఉద్దేశంతో ఆమో సినిమా నుంచి ఎగ్జిట్ అయిందని అన్నారు. ఆ తర్వాత పూజకు గుంటూరు కారం సినిమా చేయాలని ఉన్నా వేరే సినిమాను ఒప్పుకోవడంతో డేట్స్ కుదరడంలేదని సినిమా నుంచి తప్పుకుందని కూడా పలువురి వాదన. ఏదైతేనేం.. ఎప్పటినుంచో త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కి మాంచి బ్లాక్ బస్టర్ ఇస్తే చాలు.