ఆడిష‌న్‌కి పిలిచి 10 మందితో సెక్స్ సీన్స్ చేయాలన్నారు

Anne Hathaway: ప్ర‌ముఖ హాలీవుడ్ న‌టి ఆన్నీ హాథ‌వే త‌న‌కు ఎదురైన భ‌యంక‌ర‌మైన ఆడిష‌న్ గురించి బ‌య‌ట‌పెట్టారు. టీనేజ్‌లో ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన త‌న‌కు ఓ సినిమాలో ఆడిష‌న్ కాల్ వ‌చ్చింద‌ని.. తీరా వెళితే.. ప‌ది మంది అబ్బాయిలు ఉన్నారు. వారితో నువ్వు మేక‌వుట్ (సెక్స్, రొమాన్స్) చేయాలి. ఎవ‌రితో నీ కెమిస్ట్రీ బాగా కుదిరితే వారిని పెట్టి సినిమా తీసేద్దాం అని చెప్పిన‌ట్లు ఆన్నీ తెలిపారు. అది విన్నాక తాను షాక‌య్యాన‌ని.. కానీ ప్ర‌తీదానికి భ‌య‌ప‌డుతూ సిగ్గుప‌డుతుంటే జీవితంలో ఏదీ సాధించ‌లేం అనుకుని ప‌ది మందితో మేక‌వుట్ సీన్ల‌లో న‌టించాల‌న‌ని తెలిపారు.