Annapoorani: షాకింగ్.. నెట్‌ఫ్లిక్స్ నుంచి న‌య‌న్ కొత్త సినిమా డిలీట్

Annapoorani: న‌య‌న‌తార (nayanthara) న‌టించిన అన్న‌పూరాణి సినిమా నెట్‌ఫ్లిక్స్ నుంచి తొల‌గింప‌బ‌డింది. గ‌త వారం నెట్‌ఫ్లిక్స్ వేదిక‌గా రిలీజ్ అయిన ఈ సినిమాను ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ తొల‌గించింది. ఇందుకు కార‌ణం అన్న‌పూరాణి సినిమాలో రాముడు మాంసాహారుడు అనే డైలాగ్ వాడి హిందువుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసారు అంటూ మాజీ శివ‌సేన నేత ర‌మేష్ సోలంకి కేసు వేసారు. ఆ స‌న్నివేశాన్ని తొల‌గించ‌క‌పోతే సినిమా ఎప్పటికీ ఓటీటీలో ఉండ‌ద‌ని విశ్వ హిందూ ప‌రిష‌ద్ బెదిరింపుల‌కు పాల్ప‌డ‌టంతో సినీ నిర్మాత‌లు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. తాత్కాలికంగా ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్ నుంచి తొల‌గించారు.