Anirudh Ravichander: 10 కోట్లు ఇచ్చినా స‌రే..

Hyderabad: అనిరుధ్ ర‌విచంద‌ర్‌కి (anirudh ravichander) ఇప్పుడున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. విక్ర‌మ్ (vikram) సినిమాలో త‌న మ్యూజిక్‌తో సినిమాను మ‌రో స్థాయిలో నిల‌బెట్టాడు అనిరుధ్. ఆ త‌ర్వాత అత‌నికి ఆల్రెడీ ఉన్న డిమాండ్ మ‌రింత పెరిగింది. అందుకే ఇప్పుడు అత‌న్ని తెలుగులో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ (jr ntr) న‌టిస్తున్న దేవ‌ర‌కు (devara) తీసుకున్నారు. ఈ గ్యాప్‌లోనే సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ (rajinikanth) న‌టించిన జైల‌ర్ (jailer) సినిమాకు కూడా అనిరుధ్ మ్యూజిక్ అందించాడు. జైల‌ర్ సినిమాను నిల‌బెట్టింది ఒక ప‌క్క ర‌జినీ అయితే.. మ‌రో ప‌క్క అనిరుధ్ అని ఆడియ‌న్స్ టాక్. (anirudh ravichander)

దాంతో ఇప్పుడు అనిరుధ్‌కి టాలీవుడ్‌కి ఆఫ‌ర్లు పెరిగిపోతున్నాయ్. చాలా మంది తెలుగు నిర్మాత‌లు అనిరుధ్ డేట్స్ కోసం లైన్‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే వారికి అనిరుధ్ ఒక్క‌టే మాట గ‌ట్టిగా చెప్పాడ‌ట‌. ప‌ది కోట్లు ఇచ్చినా స‌రే.. తనకు కుదిరిన టైమ్‌లోనే పాటలు చేస్తానని, అంతవరకు వేచి చూస్తే సరే, లేదంటే లేదు అని తెగేసి చెప్పేసాడ‌ని టాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. (anirudh ravichander)