సల్మాన్‌కి వధువుని వెతికిపెట్టే బాధ్యత నాది
Salman Khan: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. గతంలో ఆయన సంగీత బిజ్లానీ, ఐశ్వర్యా రాయ్, కత్రినా కైఫ్‌లతో డేటింగ్ చేసారు. కానీ వారిలో ఎవ్వరినీ పెళ్లి చేసుకోలేకపోయారు. ఆ తర్వాత ఉలియా వంతూర్ అనే రోమేనియా మోడల్ని పెళ్లి చేసుకుంటారనే టాక్ కొంతకాలం వినిపించింది. ఆమెను కూడా చేసుకోలేకపోయాడు. ఇప్పటికీ సింగిల్ లైఫే బెస్ట్ అన్నట్లు గడిపేస్తున్నారు. బిగ్ బాస్ 18 ఈరోజు నుంచి మొదలుకానున్న నేపథ్యంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనిరుద్ధాచార్య సల్మాన్ పెళ్లి గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేసారు. సల్మాన్‌కి పెళ్లి పీటల నుంచి పారిపోని అమ్మాయిని తానే వెతికి పెడతానని అన్నారు. దీనికి సల్మాన్ స్పందిస్తూ.. మాకు పారిపోయే అమ్మాయే కావాలి అనడంతో కంటెస్టెంట్లంతా పగలబడి నవ్వుకున్నారు. ఈ సందర్భంగా అనిరుద్ధాచార్య సల్మాన్ ఖాన్‌కు భగవద్గీత పుస్తకాన్ని ఇవ్వడం షోలో హైలైట్‌గా నిలిచింది.