Angelina Jolie: సుపారీ ఇచ్చి త‌న‌ని తాను చంపించుకోవాల‌కున్న జోలీ

Angelina Jolie hired hitmen to kill her

Angelina Jolie:  హాలీవుడ్ స్టార్ న‌టి ఏంజిలినా జోలీ ఒకానొక స‌మ‌యంలో ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని అనుకున్నార‌ట‌. అయితే తానంతట తాను చ‌నిపోయే ధైర్యం లేక కొంద‌రికి సుపారీ ఇచ్చి త‌న‌ను హ‌త్య చేయాల‌ని చెప్పార‌ట‌. ఈ విష‌యాన్ని జోలీ ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు.

“” ఒకానొక స‌మ‌యంలో చనిపోవాల‌ని అనుకున్నాను. కానీ ఆత్మహ‌త్య చేసుకుంటే పిరికిదాన్ని అనుకుంటారు. అందుకే ఓ వ్య‌క్తికి సుపారీ ఇచ్చి దొంగ‌త‌నానికి వ‌చ్చిన‌ట్లుగా న‌టించి న‌న్ను తుపాకీతో కాల్చి చంప‌మ‌ని చెప్పా. అమెరికాలో డ‌బ్బులు ఇస్తే చంపేసేవారు చాలా మంది దొరుకుతారు. ఈ విష‌యం నేను ఆ వ్య‌క్తికి చెప్పిన‌ప్పుడు అత‌ను షాక‌య్యాడు. అయితే రెండు నెల‌లు స‌మ‌యం తీసుకోండి. అప్పుడు కూడా చ‌నిపోవాల‌ని అనిపిస్తే నాకు కాల్ చేయండి అని చెప్పి వెళ్లిపోయాడు. ఆ రెండు నెల‌ల్లో బాగా ఆలోచించుకుని ఈ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకున్నాను. అందుకే ఈరోజు మీ ముందు స‌జీవంగా ఉన్నాను “” అని తెలిపారు.