Anchor Jhansi: అఫైర్​ అంటగట్టారు.. ఝాన్సీ ఆవేదన!

Hyderabad: బుల్లితెర స్టార్ యాంకర్లలో ఝాన్సీ (Anchor Jhansi) పేరు ముందుగా వినిపించేది. అయితే ఈ మధ్య కాలంలో ఝాన్సీ బుల్లితెరకు దూరమయ్యారు. ఝాన్సీ యాంకర్ గానే కాకుండా ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించారు. ఇటీవల నాని (Nani) హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ సినిమా దసరా (Dasara)లో కీర్తి సురేష్‌(Keerthy Suresh)కు తల్లిగా నటించి మెప్పించారు.
యాంకర్‌‌గా చేస్తున్న సమయంలోనే సినిమాల్లో కూడా నటించారు ఝాన్సీ. దాంతో చాలా మంది స్టార్ హీరోలతో మంచి పరిచయాలు ఉండేవి. అసిస్టెంట్ డైరెక్టర్, యాక్టర్ అయిన జోగి నాయుడు(Jogi Naidu)ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఝాన్సీ. కానీ పెళ్లయిన సంవత్సరానికే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. అప్పటికే వారికి ఒక పాప పుట్టింది. ఒక స్టార్ హీరోతో ఎఫైర్ కారణంగానే జోగి నాయుడు, ఝాన్సీ మధ్య తరచూ గొడవలు జరిగేవనే వార్తలు వచ్చాయి. అంతేకాదు, స్టార్ హీరోతో ఎఫైర్ పెట్టుకుని పోలీస్ రైడ్ లో ఝాన్సీ దొరికిపోయిందని కూడా రూమర్లు వినిపించాయి.
అయితే, ఈ వార్తలపై తాజాగా స్పందించారు యాంకర్ ఝాన్సీ. తనపై వచ్చిన ప్రచారం మొత్తం అసత్యమేనని, తనతో ఉన్నవారికి మాత్రమే తానేంటో తెలుస్తుందని క్లారిటీ ఇచ్చారు ఝాన్సీ. ‘నాపై వచ్చిన ఆరోపణలు అన్నీ నిరాధారమైనవి. అవన్నీ నా మానసిక ఆరోగ్యాన్ని చాలా దెబ్బతీశాయి. వాటి కారణంగా కెరీర్‌‌లో చాలా అవకాశాలు దూరమయ్యాయి. భర్త నుంచి విడిపోయి చాలా కాలం అయ్యింది. అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్నాను. క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ ఆనందంగా ఉన్నాను’ అని స్పష్టం చేశారు ఝాన్సీ.