Anasuya Bharadwaj: నాకు ఫ్యామిలీ ఉంది.. న‌న్ను వ‌దిలేయండి

Hyderabad: నాకు ఫ్యామిలీ ఉంది.. ద‌య‌చేసి నాకు దూరంగా ఉండండి అంటూ ట్విటర్‌లో రిక్వెస్ట్ చేసారు అన‌సూయ భ‌ర‌ద్వాజ్ (anasuya bharadwaj). త‌న ప్రమేయం లేకుండానే త‌న పేరుతో రాజ‌కీయాల‌కు సంబంధించిన విష‌యాల్లో ట్వీట్లు వ‌స్తున్నాయ‌ని, వాటికి త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని తెలిపారు.

“మీ అంద‌రికీ ఓ విన్న‌పం. రాజ‌కీయాలు, సినిమా ఇండ‌స్ట్రీలోని వారి గురించి నా పేరును వాడి త‌ప్పుగా పోస్ట్‌లు పెడుతున్నారు. అది నాకు కూడా అవ‌మాన‌క‌ర‌మే. నాకు ఈ స‌మస్య‌ల‌తో ఎలాంటి సంబంధం లేదు. నాకు న‌చ్చిన‌ట్లుగా జీవితాన్ని గ‌డుపుతున్నాను. నాకు న‌చ్చిన విష‌యాల‌ను మాత్ర‌మే ప‌ట్టించుకుంటున్నాను. ఇది నేనే స్వ‌యంగా చెప్పాలి. ఎందుకంటే నాకు పీఆర్‌లు, ప‌బ్లిసిస్ట్‌లు ఎవ్వ‌రూ లేరు. న‌న్ను ఎంక‌రేజ్ చెయ్య‌లేక‌పోతే కనీసం నాకు దూరంగా ఉండండి. మీకు అవ‌గాహ‌న లేని విష‌యాల్లో ద‌య‌చేసి నా పేరును లాగి డిబేట్లు పెట్ట‌కండి. నాకు ఫ్యామిలీ ఉంది. ద‌య‌చేసి న‌న్ను వ‌దిలేయండి” అని తెలిపారు.